యలమంచిలి: జులై, 12( తెలుగు న్యూస్ పవర్. కామ్) వైయస్సార్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభను విజయవంతం చేయటానికి ఎలమంచిలి వైసీపీ శ్రేణులు విస్తృతంగా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఈ నెల 15 న 11 గం లకు భీమవరం వస్తున్నా సందర్బంగా, ఆదివారం యలమంచిలి మండలం, కలగంపూడి, చించినాడ గ్రామాలలో నాయకులతో జగనన్న పర్యటన కార్యక్రమం గురించి చర్చించారు. ఈ కార్యక్రంలో పాలకొల్లు వైస్సార్సీపీ ఇంచార్జ్ గుడాల గోపి, జగనన్న ప్రోగ్రాం పాలకొల్లు ఇంచార్జ్,చింతలపాటి శ్రీనివాసరాజు, మండల మాజీ అధ్యక్షులు పొత్తురి బుచ్చిరాజు, మండల అధ్యక్షులు ఉచ్చుల స్టాలిన్, ఎంపీపీ ఇనుకొండ ధనలక్ష్మి రవి కుమార్,గ్రామ అధ్యక్షులు ,ముదునూరి నర్సింహారాజు,పొత్తూరి సత్యనారాయణ రాజు, పొత్తూరి రంగరాజు,రుద్రరాజు చిట్టిరాజు, మాజీ ఎంఈఓ ముదునూరి రంగరాజు, ఎంపీటీసీ నల్లి సంధ్యారాణి నరేష్, వడ్డే రాజు,విపర్తి సాయి బాబు,చరణ్ రాజు, తదితరులు పాల్గొన్నారు.
జగనన్న భీమవరం సభకు యలమంచిలి మండలంలో సల్లాహాలు.
జగనన్న సభ విజయవంతం చేయటానికి పర్యటిస్తున్న వైసీపీ శ్రేణులు