Skip to main content

Telugu News Power

జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయం వద్ద పెనుగొండ వాసికి ప్రమాదం. ఆసుపత్రిలో తుమ్మలపల్లి మృతి.

మృతులు తుమ్మలపల్లి రామచంద్ర రావు.
పెద్దమ్మ ఆలయం వద్ద పూజలు అందుకున్న మృత్యు శకటం

హైదరాబాద్/ పెనుగొండ: ఆగస్టు,31( తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ వాసి తుమ్మలపల్లి రామచంద్రరావు(70) మృతి చెందారు. వీరి మేనల్లుడు సాయి కుమార్ ఇంటికి రామచంద్రరావు సతీసమేతంగా వైద్య పరీక్షల కోసం వెళ్లారు. ఈ సందర్భంగా, సాయి కొత్త కారు పూజ నిమిత్తం కూలీ హిల్స్ లో ఉన్న పెద్దమ్మ తల్లి ఆలయానికి తీసుకువెళ్లారు. కుటుంబ సభ్యులతో కలిసి పూజలు నిర్వహించారు. కారు తీయవాసం పొరపాటున ఎక్సలరేటర్ తొక్కటంతో కారు హఠాత్తుగా ముందుకు దూసుకు పోయింది. ఈ అనుకోని సంఘటనతో నిచ్చెష్టుడైన రామచంద్ర రావు ను బలంగా ఢీకొట్టింది. వారిని వెంటనే ఆసుపత్రికి తరలి తరలించారు. ఏఐజి గచ్చిబౌలి ఆసుపత్రిలో చికిత్స పొందు రామచంద్రరావు మరణించారు. కొత్త కారు కొనుక్కున్న సంతోషం క్షణా ల్లో విషాదంగా మారింది. ఊహించని ఈ పరిణామం వల్ల కుటుంబ సభ్యులు తీవ్ర మనస్తాపం చెందుతున్నారు.