కడప:జూలై,3(తెలుగు న్యూస్ పవర్. కామ్)కడప జిల్లాలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మక ‘జేఎస్‌డబ్ల్యూ రాయలసీమ స్టీల్ ప్లాంట్’ నిర్మాణ పనుల ప్రారంభోత్సవం జరిగింది. జే ఎస్ డబ్ల్యూ నియో ఎనర్జీ సోలార్ ప్రాజెక్ట్’ శంకుస్థాపన సందర్భంగా భారీ బహిరంగ సభ జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికతకు ఈ ప్రాజెక్టు ఒక గొప్ప ముందడుగు. ప్రధాని2030 నాటికి దేశంలో 300 మెట్రిక్ టన్నుల స్టీల్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించాలన్న లక్ష్యానికి ఒక ప్రయత్నం.ప్రధాని మోదీ సంపూర్ణ సహకారం, సీఎం చంద్రబాబు నాయుడు విజన్‌తో ఏపీలో డబుల్ ఇంజన్ అభివృద్ధి పరుగులు పెడుతోందని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ పేర్కొన్నారు.
ప్రపంచస్థాయి ప్రమాణాలతో స్టీల్ ఉత్పత్తి చేసే జేఎస్ డబ్ల్యూ గ్రూప్ కడపలో ప్లాంట్ నెలకొల్పడం రాయలసీమ వాసుల ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే కాకుండా, స్థానిక యువత ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తుందని వర్మ ఆశాభావం వ్యక్తం చేశారు .
ఈ బహిరంగ సభలో JSW జే ఎస్ డబ్లయు గ్రూప్ చైర్మన్, ఎండీ సజ్జన్ జిందాల్, ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పి.వి.ఎన్. మాధవ్, రాష్ట్ర మంత్రులు గొట్టిపాటి రవికుమార్ , ఎస్. సవిత, కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
జే ఎస్ డబ్ల్యూ రాయలసీమ ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన
ఉక్కు పరిశ్రమ శంకుస్థాపన సభలో పాల్గొన్న ప్రముఖులు