Telugu News Power

జై భారత్ క్షీరా రామ ఆక్వారైతు సంఘం. కొలువుదీరిన కొత్త కమిటీ.

పాలకొల్లు: జూలై,9( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక జై భారత్ క్షీరా రామ ఆక్వా రైతు సంఘం పూర్వ అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నికైన సందర్భంగా కొత్తవారితో కమిటీ గురువారం ఏర్పాటు చేశారు. నూతన కమిటీలో గౌరవ అధ్యక్షులుగా గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు, అధ్యక్షులుగా బోనం వెంకట నరసయ్య, చినబాబు, కార్యదర్శిగా పెనుమత్స సత్యనారాయణ రాజు, కోశాధికారిగా సోంబాబు, ఉపాధ్యక్షులుగా గొట్టుముక్కల సూర్యనారాయణ రాజు, సంయుక్త కార్యదర్శిగా ఎం ఫణీంద్ర ప్రసాద్ తో కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికయింది. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు చినబాబు మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు మార్గదర్శకత్వం లో రొయ్యల రైతుల అభ్యున్నతికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో చిలుకూరి బాలాజీ, ఆలీ, చంటి రాజు, సబ్జా వెంకట సత్యనారాయణ, అంగర వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.