
వెనిజులా: జూన్, 29( తెలుగు న్యూస్ పవర్. కామ్)వెనిజులాలో జరిగిన ఈ విషాదకరమైన సంఘటన అంతర్జాతీయంగా అనేక మందిని కంట తడి పెట్టించింది. ఈ ఘటన ఈనెల 26న వెనిజులాలో సంభవించింది. తీవ్రమైన జంట భూకంపాల వల్ల ఈ విపత్తు సంభవించింది.
హెక్టార్ బెల్లో, ఈయన వెనిజులాకు చెందిన ప్రసిద్ధ ఫుట్‌బాల్ క్రీడాకారుడు. ఇతని కుటుంబం ఒకేసారి ఆనంద, విషాదాలకు లోనైంది.
భూకంపం కారణంగా వారి ఇల్లు కూలిపోతున్న సమయంలో, హెక్టార్ బెల్లో భార్య ఆండ్రియా బెల్లో తన 20 నెలల కుమార్తె ‘అలానా’పై పడి, శిథిలాలు పాపపై పడకుండా తన శరీరంతో రక్షణ కల్పించింది. ఈ ప్రమాదంలో భవన శిథిలాల క్రింద చిక్కుకుని ఆండ్రియా మరణించగా, తల్లి ప్రాణ త్యాగం కారణంగా చిన్నారి అలానా సురక్షితంగా, ప్రాణాలతో బయటపడింది.
”నువ్వు ఎప్పటికీ మాకు అత్యంత ప్రియమైన హీరోయిన్‌వి. మన పాపను కాపాడటానికి నువ్వు నీ ప్రాణాలను ఎలా అడ్డుపెట్టావో, చివరి శ్వాస వరకు ఆమెను ఎలా వదల్లేదో నేను మన కూతురికి కథగా చెప్తాను.”
— తన భార్యకు నివాళులర్పిస్తూ హెక్టార్ బెల్లో ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన భావోద్వేగ పోస్ట్ ఇది. ఈ వీడియో వెనిజులా భూకంపంలో ఆండ్రియా బెల్లో చేసిన ప్రాణ త్యాగాన్ని మరియు ఆ ఫుట్‌బాల్ ఆటగాడి భావోద్వేగ నివాళిని స్పష్టంగా వివరిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ తల్లి త్యాగానికి సోషల్ మీడియాలో కోట్లాదిమంది నివాళులర్పించారు.