Telugu News Power

దేశ రైల్వే చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించిన నీటి రైలు.

హైడ్రోజన్ రైలు ప్రారంభిస్తున్న ప్రధాని మోడీ
హైడ్రోజన్ రైలు లోపలి దృశ్యం

హర్యానా: జూలై, 17( తెలుగు న్యూస్ పవర్. కామ్)
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్యానాలోని జింద్‌లో భారత తొలి హైడ్రోజన్‌-శక్తి రైలును ప్రారంభించారు. భారత రైల్వేలో హరిత విప్ల వానికి ప్రధాని నాంది పలికారు. ఇది స్వచ్ఛ ఇంధన ఆధారిత రవాణా దిశగా భారత రైల్వే చరిత్రలో ఒక కీలక మైలురాయిగా నిలిచింది.
ఈ రైలు హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ సాంకేతికతతో నడుస్తుంది, ఆపరేషన్ సమయంలో ప్రధానంగా నీటి ఆవిరి మాత్రమే విడుదల చేస్తుంది.
జింద్–సోనిపత్ మార్గంలో ఈ పైలట్ ప్రాజెక్టును ప్రారంభించారు.
ఈ ప్రాజెక్టు భారతీయ రైల్వే హరిత రవాణా, కార్బన్ ఉద్గారాల తగ్గింపు లక్ష్యాల్లో ఒక ముందడుగు అని పీఐబీ వివరణలు తెలిపాయి.
దేశ రైల్వే రంగంలో నూతన అధ్యాయం ప్రారంభమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం హర్యానాలోని జింద్‌ నుంచి భారత తొలి హైడ్రోజన్‌ రైలును జెండా ఊపి ప్రారంభించారు. స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన ఈ రైలు, పర్యావరణ హిత రవాణాకు భారత్‌ను మరింత దగ్గర చేస్తుందని అధికారులు తెలిపారు.
హైడ్రోజన్‌ ఫ్యూయల్ సెల్‌ ఆధారంగా పనిచేసే ఈ రైలు, విద్యుత్‌ను రైలు బోర్డులోనే ఉత్పత్తి చేస్తుంది. దీంతో రైలు నడిచే సమయంలో కర్బన ఉద్గారాలు గణనీయంగా తగ్గి, నీటి ఆవిరి మాత్రమే బయటకు వస్తుంది. భారత రైల్వేలు శుభ్రమైన, స్థిరమైన రవాణా వ్యవస్థ వైపు అడుగులు వేస్తున్నాయని స్పష్టం చేశాయి.
ఈ ప్రారంభోత్సవం ద్వారా భారత్, హైడ్రోజన్‌ రైల్వే సాంకేతికతను స్వీకరించిన దేశాల సరసన చేరింది. జింద్–సోనిపత్ మార్గంలో ఈ రైలు సేవలు ప్రయోగాత్మక దశలో ఉన్నప్పటికీ, భవిష్యత్‌లో దీన్ని మరిన్ని మార్గాలకు విస్తరించే అవకాశం ఉందని నివేదికలు సూచిస్తున్నాయి.