Telugu News Power

నిషేధిత భూముల 22-ఏ సమస్యల పరిష్కారంపై కలెక్టర్ సమీక్ష.

భీమవరం: జూలై, 22( తెలుగు న్యూస్ పవర్. కామ్) రాష్ట్ర ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. 22-ఏ నిషేధిత భూముల జాబితాకు సంబంధించిన దరఖాస్తులను పారదర్శకంగా, వేగవంతంగా పరిష్కరించే దిశగా ప్రత్యేక చర్యలు కొనసాగుతున్నాయని బుధవారం పేర్కొన్నారు.
పరిశీలించిన 16 దరఖాస్తుల్లో 10 కేసులు పరిష్కారం, 2 కేసులు తిరస్కరణ, 4 కేసులు పూర్తి పత్రాలు లేకపోవడంతో వచ్చే వారానికి వాయిదా వేశారు.రైతులు పట్టాదారు పాస్‌బుక్, రిజిస్ట్రేషన్ పత్రాలు, 1-బి, అడంగల్, ఎఫ్‌ఎంబీ తదితర అవసరమైన రికార్డులను సమర్పించాలని కలెక్టర్ సూచించారు.