
‘బిల్లా’, ‘భోళా శంకర్’ వంటి చిత్రాల దర్శకుడు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మెహర్ రమేష్ కుమార్తె కృష్ణ మోహన వివాహం, అనిరుధ్‌తో హైదరాబాద్‌లో గురువారం అత్యంత వైభవంగా జరిగింది. వరుడు అనిరుధ్ మరెవరో కాదు, ప్రముఖ రాజకీయ నాయకుడు, మాజీ ఐఏఎస్, ఛానల్ అధినేత తోట చంద్రశేఖర్ కుమారుడు.
ఈ పెళ్లి వేడుక టాలీవుడ్‌లో పెద్ద టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది. మెహర్ రమేష్‌కు మెగా కుటుంబంతో ఉన్న బంధుత్వం కారణంగా ఈ వేడుకలో మెగా ఫ్యామిలీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్, ప్రముఖ దర్శకులు కొరటాల శివ, వి.వి. వినాయక్, గుణశేఖర్, శ్రీనువైట్ల తదితరులు హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు.