మానవాళి శాంతియుత సహజీవనానికి అవసరం.
పాలకొల్లు: అక్టోబర్,1(తెలుగు న్యూస్ పవర్. కామ్)స్థానిక బి ఆర్ ఆర్ అండ్ జి కే ఆర్ చాంబర్స్ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో గురువారం గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కళాశాల చైర్మన్ కెవిఆర్ నరసింహారావు హాజరయ్యారు. గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
చైర్మన్ మాట్లాడుతూ, గాంధీ సిద్ధాంతాలు నేటి సమాజానికి ఎంతో అవసరమని, శాంతియుత జీవనానికి మానవ మానవ మనుగడకు గాంధీ సిద్ధాంతాలు పాటించాలన్నారు. గాంధీ యొక్క తత్వం ఒక జీవన విధానం అని, మానవుడు మానవుడిగా జీవించగలిగే ఒక మానవీయ సమాజాన్ని ఏర్పాటు చేసేందుకు ఉపయోగపడతాయని అన్నారు. గాంధీజీ నా జీవితమే నా సందేశం అని చాటి చెప్పిన మహానాయకుడిని, ఆయన చూపిన సత్యం, అహింస అనే ఆయుధాలే భారత స్వాతంత్ర సంగ్రామం లో కీలకపాత్ర పోషించాయని, మన దైనందిని జీవితంలో స్వచ్ఛత, స్వదేశీ భావన, క్రమశిక్షణ మరియు ఇతరుల పట్ల దయ కలిగి ఉండటమే మనం గాంధీజీకి ఇచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. గాంధీ జయంతి సందర్భంగా, విద్యార్థిని విద్యార్థులకు వక్తృత్వo, వ్యాసరచన చిత్రలేఖనం లలో పోటీలు నిర్వహించి ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతులను విద్యార్థులకు అథిదులు అందజేసారు.
ఈ కార్యక్రమానికి, కళాశాల సెక్రటరీ, కెవి సీతారామరాజు, కళాశాల ట్రెజరర్ ఆర్ ప్రవీణ్ భాను, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ డి వెంకటేశ్వరరావు, అకాడమీ అడ్వైజర్స్ డాక్టర్ ఎబిఎస్ మూర్తి, ఎన్ సీతారామారావు , అధ్యాపకులు రాధా మాధవి, రంజని, రాంబాబు, ఎన్. రవికుమార్ తదితరులు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.