పాలకొల్లు: జూలై, 17( తెలుగు న్యూస్ పవర్. కామ్) ఇటీవల విడుదలైన వైద్య విద్య, నీట్ -2026 పరీక్ష ఫలితాల్లో, పాలకొల్లుకు చెందిన అంత్యం సాకేత్, 359 జాతీయ ర్యాంకు సాధించారు. వీరి తల్లిదండ్రులు రాజీవ్,దీప్తి ఇరువురు వైద్యులు. నానమ్మ అంత్యం గీతారాణి కూడా వైద్యురాలు. సాకేత్ మూడో తరానికి ప్రతినిధి. సాకేత్ విద్యలో తన ప్రతిభ చాటుకున్నారు. పదవ తరగతిలో 600 మార్కులకు గాను 594 మార్కులు సాధించి పట్టణంలో ప్రథముడిగా నిలిచారు. ఇంటర్మీడియట్లో వెయ్యి మార్కులకు 983 మార్కులు సాధించారు. దేశవ్యాప్తంగా 22 లక్షల మంది హాజరైన ఈ పరీక్షలో తన ప్రతిభను చాటుకున్న సాకేత్ ను పట్టణ ప్రముఖులు అభినందించారు.
పాలకొల్లుకు నీట్ 359 ర్యాంక్ అంత్యం వారి ఇంట హర్షాతిరేకాలు.