మోపిదేవి: జూన్, 24( తెలుగు న్యూస్ పవర్. కామ్) అవనిగడ్డ నియోజకవర్గం మోపిదేవి మండలం కొక్కిలిగడ్డలో పి4 పథకంలో భాగంగా దాతల సహకారంతో రూ.1.4కోట్లతో నూతనంగా నిర్మించిన జెడ్పీ హైస్కూలు నూతన భవనాలను విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా లోకేష్ కొక్కిలిగడ్డ హైస్కూలు ఉపాధ్యాయులు, విద్యార్థులతో ముచ్చటించారు. రెండేళ్లలో విద్యావ్యవస్థలో సంస్కరణలన్నీ పూర్తి చేశామన్నారు. ఉపాధ్యాయులంతా పూర్తిగా ఫలితాలపైనే శ్రద్ధ వహించాలని పిలుపునిచ్చారు. విద్యా వ్యవస్థలో ఉన్న వారంతా ఏకత్రాటి పైకి వచ్చి” ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్” కోసం కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ తరగతులలో ఉపాధ్యాయునిగా పాత్ర పోషించారు. ఉపాధ్యాయులు చెప్పేది తరగతి గదిలో విద్యార్థిగా విన్నారు. లోకేష్ కు స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు. రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కు మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, అవనిగడ్డ ఎమ్మెల్యే, మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్, నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్. జిల్లా ఇంచార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్, టీడీపీ జిల్లా అధ్యక్షులు వీరంకి గురుమూర్తి, స్థానిక కూటమి నాయకులు, గ్రామ ప్రముఖులు విద్యార్థుల తల్లిదండ్రులు ఘన స్వాగతం పలికారు.
పి-4 ఉన్నత పాఠశాల ప్రారంభించిన మంత్రి లోకేష్.
లోకేష్ ప్రారంభించిన ఉన్నత పాఠశాల