Telugu News Power

పేదల కోసం వైద్య పథకాలు అమలు చేస్తున్న ప్రధాని మోడీ. -ముళ్ళపూడి రేణుక

వైద్య శిబిరంలో పాల్గొన్న డాక్టర్ ముళ్ళపూడి రేణుక, ట్రస్ట్ చైర్మన్ రావూరి సుధా తదితరులు
ఉచిత వైద్య శిబిరానికి హాజరైన ప్రజలు

స్వచ్ఛ సేవ భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం.

పాలకొల్లు: జూలై,11( తెలుగు న్యూస్ పవర్. కామ్) పేదల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రధాని నరేంద్ర మోడీ వైద్య పథకాలు అమలులోకి తెచ్చారని రాష్ట్ర బిజెపి అధికార ప్రతినిధి ముళ్ళపూడి రేణుక పేర్కొన్నారు. స్థానిక శ్రీ ముఖదారమ్మ ఆలయం వద్ద శనివారం నిర్వహించిన వైద్య శిబిరం ప్రారంభించిన సందర్భంగా రేణుక మాట్లాడారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, పేదలకు ఐదు లక్షల వరకు ఏ ఆసుపత్రిలోనైనా వైద్యచికిత్సలు అందజేయడానికి ఆరోగ్య భీమా అమలు చేస్తున్నట్టు వెల్లడించారు. తక్కువ ధరకే మందులు అందుబాటులో ఉండేలా ఆయుష్మాన్ భారత్ జనరిక్ మందులు జన ఔషధీ కేంద్రాల ద్వారా అందజేస్తున్నారని తెలిపారు. స్వచ్ఛ సేవ భారత ట్రస్ట్ సేవలను రేణుక కొనియాడారు. రావూరి లక్ష్మణరావు( సుధ) వ్యవస్థాపక అధ్యక్షులుగా స్వచ్ఛభారత్ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. సుమారు 250 మంది కి ఈ శిబిరంలో వైద్య సేవలు అందించారు. అమలాపురం కిమ్స్ వైద్యులు ఈ ఈ శిబిరంలో వైద్య సహాయం అందజేశారు. ఈ చివరన ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో, రాష్ట్ర మీడియా అధికార ప్రతినిధి ఉన్నమట్ల కపర్తి, కొల్లి కొండ ప్రసాద్, జక్కంపూడి కుమార్, గవర పవన్ నాయుడు, వల్లభ దుర్గారావు, దొంగ కుమార్, యర్రంశెట్టి పద్మారావు, వీరాజీ, మల్లవోలు సురేష్, కోరాడ సూరిబాబు , చినమిల్లి బాబి, శ్యామల గౌరీ, అల్లూరి పద్మ వర్మ, వేరుకొండ దుర్గాప్రసాద్, మండేలా ఫణి, కుక్కల కేశవరావు, నాలం బాబి, చేగొండి బాబి, బోడ కనకరాజు, పడవల ఉమ తదితరులు పాల్గొన్నారు.