
ఉజ్బెకిస్తాన్‌లోని తాష్కెంట్ స్టేట్ యూనివర్శిటీ ఆఫ్ ఓరియంటల్ స్టడీస్‌లో ఉన్న ‘మహాత్మా గాంధీ సెంటర్’ను ప్రధాని నరేంద్ర మోదీ
సందర్శించారు. అక్కడ ఉజ్బెకిస్తాన్ విద్యార్థులు ప్రధాని మోదీ స్వయంగా రాసిన హిందీ కవితలను ఎంతో చక్కగా ఆలపించారు.
మోదీ భావోద్వేగం
హిందీ ఆ విద్యార్థులకు మాతృభాష కాకపోయినా, ఆయన రాసిన కవితలోని భావాలను తమ హృదయాల్లో అనుభూతి చెంది సరిగ్గా అదే భావాలతో చదవడం చూసి ప్రధాని నరేంద్ర మోదీ చాలా భావోద్వేగానికి గురయ్యారు.
ఆ కవిత ఆశ, పట్టుదల, కష్టాలను ఎదుర్కొంటూ ముందుకు సాగడం, ఒక కొత్త ఉషోదయంతో భవిష్యత్తును నిర్మించుకోవడం గురించి తెలియజేస్తుంది.
ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా ఉజ్బెకిస్తాన్ విద్యార్థులకు భారతదేశంపై, హిందీ భాషపై ఉన్న అభిమానం స్పష్టంగా తెలియజేసారు.
ఈ సాంస్కృతిక వారసత్వం తరతరాలుగా వస్తున్నది. అప్పటి హిందీ చలనచిత్ర హీరో రాజ్ కపూర్ రష్యన్లకు అభిమాన హీరోగా ఉండేవారు. ఆయన చిత్రాలు అక్కడ అధిక సంఖ్యలో ప్రదర్శించే వారు. మేరా నామ్ జోకర్ చిత్రం లో రష్యన్ కళాకారులు, ఒక హీరోయిన్ తో సహా ప్రముఖ పాత్రలు పోషించారు. ఇతర దేశాల్లోహిందీని అభిమానిస్తుంటే, స్వదేశంలో హిందీని తమపై బలవంతంగా రుద్దవద్దని వ్యతిరేక ఉద్యమాల చేసే వర్గానికి గుండెల్లో గుబులు పుట్టించే అంశం ఇది.