హైదరాబాద్: ఆగష్టు, 26( తెలుగు న్యూస్ పవర్.కామ్)
ఆంధ్రప్రదేశ్ పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారు ‘#ప్రేమనే ఊరిలో’ చిత్రం థియేట్రికల్ టీజర్‌ను ఆవిష్కరించారు. ఈ చిత్రం మనోజ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతోంది.
నిర్మాతలు మహారత్న ప్రొడక్షన్స్, ఎస్కే పిక్చర్, వెనీలా ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీరామ్, రామిక శివు, తపస్విని పూనచ్చ, సునాద్ గౌతమ్, రాజ్‌కాంత్ ఎస్‌కే, హర్షిత్ ప్రభు వంటి నటీనటులు ఈ చిత్రంలో నటిస్తున్నారు.
ఈ టీజర్ ‘#ఇరుముడి’ మరియు ‘#టాక్సిక్’ చిత్రాలకు జోడించి ప్రేక్షకులు థియేటర్లలో వీక్షించే అవకాశం ఉందని. సంతోషం సినీ వారపత్రిక అధినేత సురేష్ కొండేటి గురువారం తెలిపారు.
ప్రేమనే ఊరిలో టీజర్ ఆవిష్కరించిన మంత్రి కందుల దుర్గేష్.
టీజర్ విడుదల చేస్తున్న మంత్రి దుర్గేష్