Telugu News Power

బిజెపిని బలపరచాలి. నాయకుల పిలుపు.

శ్యాం ప్రసాద్ ముఖర్జీకి నివాళులు అర్పిస్తున్న బిజెపి నాయకులు

పాలకొల్లు: జూలై, 6 (తెలుగు న్యూస్ పవర్.కాం) బిజెపి పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లి, బలపరచాలని మండల కమిటీ సమావేశంలో నిర్ణయించారు. స్థానిక గజలక్ష్మి సెంటర్ వద్ద గౌరవనీయుడు స్వగృహంలో మండల యువమోర్చా సమావేశం సోమవారం జరిగింది. పట్టణ అధ్యక్షులు కుళ్ళుకొండ ప్రసాద్ ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రత్యేక విస్తృత స్థాయి ఓటర్ల రివిజన్ కార్యక్రమంలో కార్యకర్తలంతా పాల్గొని ఓటర్లను చేర్చాలని కోరారు. బి ఎల్ ఓ, బి ఎల్ ఏ లకు పార్టీ క్యాడర్ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో జన సంఘ రూపశిల్పి శ్యాం ప్రసాద్ ముఖర్జీకి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు ఉన్నమట్ల కాపర్తి, గవర పవన్ నాయుడు, జక్కంపూడి కుమార్, వేరుకొండ దుర్గాప్రసాద్, పవన్ నాయుడు, రావూరి సుధా, నాలం బాబీ చెరుకూరు శ్రీనివాస్, అడ్డాల మూర్త, బైలా శ్రీధర్ తదితల్లి కార్యక్రమంలో పాల్గొన్నారు