హైదరాబాద్: ఆగస్టు,10( తెలుగు న్యూస్ పవర్. కామ్)
రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, రైతుల జీవితాల్లో ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్షిస్తూ నిర్వహించిన వరుణ యాగం పూర్ణాహుతి కార్యక్రమంలో సతీసమేతంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం పాల్గొన్నారు.
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ అర్చకులు, వేదపండితుల ఆధ్వర్యంలో 108 మంది రుత్వికులతో, 11 హోమగుండాలతో వరుణ యాగాన్ని నిర్వహించారు.
కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసి, చెరువులు, జలాశయాలు నిండాలని. పంటలు సమృద్ధిగా పండాలని. రైతన్నల కష్టానికి తగిన ఫలితం దక్కాలని . ప్రతి కుటుంబం సంతోషంగా, సుభిక్షంగా జీవించాలని.
ప్రజల సంక్షేమం, రైతుల శ్రేయస్సు, ప్రజా ప్రభుత్వానికి ఎల్లప్పుడూ అత్యున్నత ప్రాధాన్యం గా ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో తెలంగాణలో వరుణ యాగం.
వరుణ యాగం నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి దంపతులు