
పాలకొల్లు: ఆగస్టు,10( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శంభుని అగ్రహారం లో వేంచేసి ఉన్న శ్రీ రత్నమాల సమేత సంభేశ్వర స్వామి వారి ఆలయంలో మహా రుద్రయాగం సోమవారం ప్రారంభమైంది. దైవజ్ఞ డాక్టర్ నెట్టల ఫణి భాస్కర శర్మ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు ఈ యాగం జరుగుతుందని తెలిపారు. మూడు రోజులపాటు జరిగే ఈ మహా రుద్ర యాగంలో 1331 సార్లు రుద్రాభిషేకం జరుగుతుందని వివరించారు. స్వామివారికి పంచ హారతులు, ధూప సేవ, అన్నాభిషేకము, రుద్రకమార్చన, నంది అభిషేకం, దశమహావిద్య సహిత మంగళ చండి హోమము వంటి విశేష పూజలు జరుగుతాయి. విగ్నేశ్వర పూజ, రుత్విక్ వరుణ, మండపారాధన, మహాన్యాసము, మహా రుద్రాభిషేకము, లక్ష్మీ గణపతి హోమము, నంది అభిషేకము, ఆరుద్ర నక్షత్ర విశేష అభిషేకం, దత్త హోమం, శ్రీ మేధా దక్షిణామూర్తి హోమం, నీరాజన మంత్రపుష్పములు,
చతుర్వేద స్వస్తి పూజా కార్యక్రమాలు తొలి రోజు జరిగాయి. ఈ యాగంలో పాల్గొనేవారు దేవస్థానం వారిని సంప్రదించాలని కోరారు. మహా రుద్ర అతి రుద్ర యాగంలో అతి ప్రాచీనమైన వైదిక క్రతువులు నిర్వహించడం ద్వారా శీఘ్రంగా పరమేశ్వర కటాక్షమునకు దోహదపడతాయని దైవజ్ఞ లపై భాస్కర్ శర్మ తెలిపారు. లబ్ద ప్రతిష్టులైన ఘనాపాటిలతో తోపాటు, ఎవరు ద్వికులు ఈ యాగానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వేద ఘోషతో ఆలయ పరిసర ప్రాంతాలు మారు మ్రోగాయి. భక్తి శ్రద్ధలతో భక్తులు పూజాధికాల్లో పాల్గొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో విశేషంగా యాగాలు జరుగుతున్నాయి.