యలమంచిలి: ఆగస్టు,15( తెలుగు న్యూస్ పవర్. కామ్) మండల పరిషత్ కార్యాలయం వద్ద 80 స్వతంత్ర దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఎంపీపీ వినుకొండ ధనలక్ష్మి రవికుమార్ పథకావిష్కరణ చేశారు. మండల అభివృద్ధి అధికారి, జె డి వి ప్రసాద్, వివిధ శాఖల అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక తహశిల్దార్ కార్యాలయం వద్ద పతాకావిష్కరణ సందర్భంగా, విద్యార్థులకు లోటు పుస్తకాలు, పెన్నులు తాసిల్దార్ గ్రంధి వెంకట పవన్ కుమార్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో, మండల టిడిపి అధ్యక్షులు మామిడి శెట్టి పెద్దిరాజు, మాజీ జెడ్పిటిసి బోనం నాని, ఎంపీటీసీలు పాల్గొన్నారు. వివిధ విద్యా సంస్థలు ప్రభుత్వ కార్యాలయాలు వద్ద పతాకావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.
యలమంచిలి మండలంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు.
మండల పరిషత్ కార్యాలయం వద్ద పతాకావిష్కరణ చేస్తున్న ఎంపీపీ ధనలక్ష్మి