Telugu News Power

రికార్డులు బద్దలు కొట్టిన ప్రభుత్వ బడులు. ప్రైవేటు నుంచి లక్ష మంది విద్యార్థులు చేరిక.

అధికారులతో సమీక్ష చేస్తున్న విద్యాశాఖ మాత్యులు లోకేష్

అమరావతి: జూన్, 26( తెలుగు న్యూస్ పవర్. కామ్) రాష్ట్ర విద్యా శాఖ మాత్యులు నారా లోకేష్ ప్రభుత్వ పాఠశాలల పనితీరుపై శుక్రవారం సమీక్షించారు. రాష్ట్రంలోని ప్రైవేట్ స్కూళ్ల నుంచి ప్రభుత్వ బడులకు 1.06 లక్షల మంది ఏడాది మరలి వెళ్ళినట్టు అధికారులు మంత్రికి తెలిపారు. ప్రాథమికోన్నత పాఠశాలలు 7,620 ఉన్నాయి. వీటిలో 3,515 పాఠశాలలో గరిష్టంగా 46.13 శాతం ప్రవేశాలు జరిగాయి. విద్యారంగంలో ప్రవేశపెట్టిన వినూత్న విధానాల వల్లనే ఇది సాధ్యమైందని సమావేశంలో నిర్ణయించారు. ఈ ఏడాది 159 ప్రాథమిక ఆదర్శ పాఠశాలలు గా మార్చడానికి అనుమతి ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి పాఠశాలలో విద్యార్థుల హాజరు మెరుగుపరచడానికి తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉపాధ్యాయులు అభ్యసన ఫలితాలపై దృష్టి పెట్టాలని కోరారు.