న్యూఢిల్లీ: జూన్,22 ( తెలుగు న్యూస్ పవర్. కామ్)
కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన జన్ విశ్వాస్ చట్టం-2026 క్రొత్త నిబంధనల ప్రకారం
రైళ్లలో పొగతాగితే అప్పటికప్పుడే రూ.2,000 జరిమానా విధిస్తారు.
అనధికారిక వ్యాపారాలు, భిక్షాటనపై పూర్తి నిషేధం అమలులోకి వచ్చింది.
జరిమానా కట్టకపోతే 3 నెలల జైలు లేదా రూ.5 వేల జుర్మాన వేస్తారు. నిబంధనలు ఉల్లంఘిస్తే రైలు నుంచి దింపేసేలా అధికారులకు వీలు కల్పించారు.
రైలు ప్రయాణికుల భద్రత, ప్రయాణాన్ని మరింత ఆహ్లాదకరంగా మార్చేందుకు భారతీయ రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది. ‘జన్ విశ్వాస్ (నిబంధనల సవరణ) చట్టం-2026’ కింద రైల్వే నిబంధనల ప్రభుత్వ గెజిట్ విడుదల చేసింది. ఈ నెల 19న అధికారికంగా విడుదలైన ఈ నిబంధనలు తక్షణమే అమలులోకి వచ్చాయని రైల్వే శాఖ స్పష్టం చేసింది.
ఈ నూతన చట్టం ప్రకారం.. రైల్వే చట్టం 1989లోని సెక్షన్ 167 కింద గతంలో ధూమపానానికి ఉన్న రూ.100 స్వల్ప జరిమానాను ఇప్పుడు ఏకంగా రూ.2,000కు పెంచారు. అంతేకాకుండా స్మోకింగ్ చేస్తూ దొరికితే వెంటనే సదరు ప్రయాణికుడి పాస్ లేదా టికెట్‌ను రద్దు చేసి, తదుపరి స్టేషన్‌లో రైలు నుంచి కిందకు దించేసే అధికారాన్ని రైల్వే సిబ్బందికి కల్పించారు. ఒకవేళ అక్కడికక్కడే జరిమానా చెల్లించకపోతే కోర్టు ముందు హాజరుపరుస్తారు, అక్కడ నేరం రుజువైతే గరిష్టంగా రూ.5 వేల వరకు జరిమానా పడే అవకాశం ఉంది. రైళ్లలో సంభవించే అగ్ని ప్రమాదాలను నివారించేందుకు, తోటి ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా చూసేందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు తెలిపింది.
మరోవైపు సెక్షన్ 144 కింద రైల్వే లైసెన్స్ లేకుండా రైళ్లలో తిరుగుతూ వ్యాపారం చేసే హ్యాకర్ల పై పూర్తి నిషేధం విధించారు. వీరికి కూడా రూ.2వేల జరిమానా విధిస్తారు. ఒకవేళ వీరు జరిమానా కట్టని పక్షంలో కోర్టు ద్వారా 3 నెలల వరకు జైలు శిక్ష, రూ.5,000 ఫైన్ లేదా ఈ రెండూ విధించేలా చట్టాన్ని సవరించారు. ఇక పదే పదే (నాలుగోసారి లేదా అంతకంటే ఎక్కువ) ఈ నిబంధనలు ఉల్లంఘిస్తూ దొరికిపోతే కనీసం 3 నెలల నుంచి గరిష్టంగా ఏడాది పాటు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. గతంలో లాగా కేవలం క్రిమినల్ ప్రాసిక్యూషన్ కోసం వేచి చూడకుండా, సివిల్, అడ్మినిస్ట్రేటివ్ చర్యల ద్వారా వేగంగా జరిమానాలు వసూలు చేసేలా రైల్వే అధికారులకు పూర్తి అధికారాలు ఇవ్వడంతో రాబోయే రోజుల్లో తనిఖీలు మరింత ముమ్మరం కానున్నాయి. ప్రభుత్వం ఎందుకు సంబంధించి ముందుగానే విస్తృత ప్రచారం చేసి, అవగాహన కల్పించవలసి ఉంది.
రైళ్లలో భిక్షాటన, అనధికారిక వ్యాపారాలపై కేంద్రం నిషేధం.
రైలులో భిక్షాటన చేస్తున్న ట్రాన్స్ జెండర్