
యలమంచిలి: ఆగస్టు, 22( తెలుగు న్యూస్ పవర్. కామ్) కోట్లాదిమంది అభిమానధనుడు, మెగాస్టార్, మాజీ కేంద్రమంత్రి కొణిదల చిరంజీవి 71వ పుట్టినరోజు వేడుకలు ఏనుగువానిలంక, పొత్తూరి రామలింగరాజు ( కాశీ రాజు) ఉన్నత పాఠశాలలో, విద్యార్థుల సమక్షంలో శనివారం ఘనంగా జరిగాయి. చిరంజీవి స్వయంకృషికి, గొప్ప స్ఫూర్తని, ఆయన జీవితం నేటి తరానికి ఆదర్శమని వక్తలు పేర్కొన్నారు. రక్త నిధి, నేత్రనిధి ద్వారా ఎందరికో ప్రాణదానం, దృష్టిదానం చేస్తున్న దేవుడని చిరంజీవి సేవలను కొనియాడారు. ప్రతి ఏటా చిరంజీవి పుట్టినరోజు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు అభిమానులు తెలిపారు. ఈ సందర్భంగా,250 మంది విద్యార్థులకు 2 రాత పుస్తకాలు, పెన్ను,పెన్సిల్ తదితర స్టేషనరీ, బిస్కెట్లు చాక్లెట్లు మెగాస్టార్ అభిమానులు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రముఖులు పొత్తూరి వెంకటరాజు, మండల అధ్యక్షురాలు ఇనుకొండ ధనలక్ష్మి రవికుమార్, ప్రధానోపాధ్యాయులు అవధాని, వారి సిబ్బంది, చింతా సత్తిబాబు, ముచ్చర్ల శ్రీనివాస్, ఎస్. రాజేష్, దాసంశెట్టి శ్రీనివాసరావు కామిశెట్టి హరికుమార్, ఇనుకొండ రాజు, చింతా చిన్న తదితరులు పాల్గొన్నారు.