Skip to main content

Telugu News Power

వేటకు వెళ్లి గల్లంతయిన మత్స్యకార కుటుంబాలను పరామర్శించిన మంత్రి అచ్చెం నాయుడు.

మత్స్యకార కుటుంబాలను పరామర్శిస్తున్న మంత్రి కింజరపు

ఓడలరేవు: ఆగస్టు,19( తెలుగు న్యూస్ పవర్. కామ్)
సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతైన మన మత్స్యకారులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చేందుకు ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపడుతోందని రాష్ట్ర వ్యవసాయ మత్స్య శాఖ మాత్యులు గింజరపు అచ్చం నాయుడు బుధవారం తెలిపారు.
ఈ నెల 3న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఓడలరేవు ఫిషింగ్ ల్యాండింగ్ సెంటర్ నుంచి ‘ముత్యాలమ్మ’ బోటులో వెళ్లి సముద్రంలో చిక్కుకుపోయిన ఏడుగురు మత్స్యకారుల క్షేమం కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జిల్లా ఇన్‌చార్జి మంత్రి, రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
గాలింపు చర్యలపై అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తూన్నారు.
బాధిత మత్స్యకార కుటుంబాలను నేరుగా కలిసి పరామర్శించారు. వారు ఎలాంటి ధైర్యం కోల్పోవద్దని, ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని వారికి ధైర్యం చెప్పారు.
భారత నౌకాదళం, కోస్ట్‌గార్డ్, మెరైన్ పోలీసుల సమన్వయంతో 5 కోస్ట్‌గార్డ్ నౌకలు, 2 నేవీ నౌకలు మరియు 2 అత్యాధునిక విమానాలతో సుమారు 300 నాటికల్ మైళ్ల పరిధిలో రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా సాగుతోందని వెల్లడించారు. ఒడిశాలోని పారాదీప్ సమీపంలో లభించిన సమాచారం ఆధారంగా ప్రత్యేక బృందాలను కూడా రంగంలోకి దించినట్టు వెల్లడించారు.
పడవలో సరిపడా ఇంధనం, 20 రోజులకు పైగా ఆహార నిల్వలు ఉండటంతో పాటు ప్రస్తుతం సముద్రంలో వాతావరణం అనుకూలంగా ఉన్నందున వారు క్షేమంగా తిరిగి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఆ మత్స్యకార సోదరులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చే వరకు ఈ గాలింపు చర్యలు కొనసాగుతాయని. ప్రభుత్వం మత్స్యకారులకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది మంత్రి అచ్చెమ్ నాయుడు భరోసా ఇచ్చారు. ఈ పర్యటనలో నరసాపురం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ తదితరులు పాల్గొన్నారు.