Skip to main content

Telugu News Power

వైసిపి సర్పంచులకు సన్మానం

వైసిపి సర్పంచుల సన్మాన కార్యక్రమం లో పాల్గొన్న ఇంచార్జ్ గుడాల గోపి

పాలకొల్లు: మార్చి,30(తెలుగు న్యూస్ పవర్. కామ్) పాలకొల్లు నియోజకవర్గం వైసీపీ పార్టీ ఇంచార్జ్ గుడాల హరి గోపాల రావు సోమవారం నియోజకవర్గ స్థాయిలో సర్పంచులకు సన్మానం చేశారు. ప్రజల కోసం, గ్రామ ప్రగతి కోసం,గత ఐదేళ్లుగా తమ సేవలు అందించినందుకు వైసీపీ పార్టీ తరఫున ఈ సత్కారం అందజేస్తున్నట్టు గుడాల గోపి తెలిపారు. వీరి పదవి కాలం ముగిసినందున వీడ్కోలు సభ ఏర్పాటు చేసి, కృతజ్ఞతాభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎలమంచిలి మండల పరిషత్ అధ్యక్షురాలు వినుకొండ ధనలక్ష్మి రవికుమార్, పట్టణ వైసీపీ అధ్యక్షులు కోరాడి శ్రీనివాస్, ఎలమంచిలి మండల అధ్యక్షులు ఉచ్చుల స్టాలిన్ బాబు తదితరులు పాల్గొన్నారు.