తుని:ఆగస్టు,7( తెలుగు న్యూస్ పవర్. కామ్)
ఆషాఢ మాసం సందర్భంగా కాకినాడ జిల్లా తుని సమీపంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తలుపులమ్మ లోవ లో వేంచేసి ఉన్న శ్రీ తలుపులమ్మ తల్లిని రాష్ట్ర హోంశాఖ మంత్రి గుడి అనిత దర్శించుకున్నారు. ఈ సందర్భంగా, అమ్మవారికి చీర సమర్పించారు. దేవస్థానం అర్చకులు, అధికారులు మర్యాదలతో మంత్రికి ఘనస్వాగతం పలికారు. అర్చకులు, మంత్రికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి విధులు చేసే భాగ్యం కలిగిందని మంత్రి భక్తి భావాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, అభివృద్ధి కోసం అమ్మవారిని ప్రార్థించానని తెలిపారు. అనంతరం దర్శనానికి వచ్చిన భక్తులతో ఆప్యాయంగా ముచ్చటించి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. వారితో జరిగిన సంభాషణ సంతోషాన్ని ఇచ్చిందని సంతృప్తి వ్యక్తం చేశారు. అమ్మవారి కరుణాకటాక్షాలు అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మంత్రి ఆకాంక్షించారు. మంత్రి పర్యటన స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు. హోం మంత్రిని స్వయంగా చూసి మాట్లాడే అవకాశం దొరికినందుకు ఆనందం వ్యక్తం చేశారు
శ్రీ తలుపులమ్మ తల్లిని దర్శించుకున్న హోం మంత్రి అనిత.