భీమవరం: ఆగస్టు, 6( తెలుగు న్యూస్ పవర్. కామ్)
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు, ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి సంపూర్ణ స్వర్ణవస్త్రం పధకానికి, విశాఖపట్టణం కి చెందిన వేగేశ్న సురేష్ కుమార్ వర్మ, సువర్ణ తేజశ్వి దంపతులు 10 గ్రాముల బంగారం విరాళంగా అందజేసారు. ఆలయ అర్చకులు వీరికి పూజలు ఆశీర్వచనాలు నిర్వహించారు. ఈ సందర్భంగా, వారికి, శేష వస్త్రం, అమ్మవారి చిత్రపటం, తీర్థప్రసాదాలు ఇచ్చి సత్కరించారని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ గురువారం తెలిపారు.
శ్రీ మావుళ్ళమ్మకు 10 గ్రాముల బంగారం కానుక.