భీమవరం: ఆగస్టు, 7( తెలుగు న్యూస్ పవర్. కామ్)పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు,ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి శాశ్వత నిత్యాన్నదాన వితరణకి నంద్యాలకు చెందిన యాసం వెంకటేశ్వరరెడ్డి కుటుంబ సభ్యులు యాసం వీరారెడ్డి పెద్ద వీరమ్మ జ్ఞాపకార్థం రూ.1,00,116 లు విరాళంగా శుక్రవారం సమర్పించారు.వీరికి ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ పూజలు ఆశీర్వచనాలు నిర్వహించారు.ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి శేషవస్త్రం, ఆలయ ధర్మకర్తలు రామాయణం శ్రీనివాస్,పాపోలు ఏడుకొండలు అమ్మ వారి చిత్రపటం, ప్రసాదం అందజేసారు.
శ్రీ మావుళ్ళ కు నంద్యాల వాసి, యాసం కుటుంబ సభ్యులు రూ. లక్ష విరాళం.