Skip to main content

Telugu News Power

సందిగ్ధంలో మున్సిపాలిటీ ఎన్నికలు. అభివృద్ధి కోసం కక్షిదారులు వ్యాజ్యాలు ఉపసంహరించుకోవాలి. -మంత్రి నిమ్మల విజ్ఞప్తి.

పత్రికా సమావేశం మాట్లాడుతున్న మంత్రి నిమ్మల

పాలకొల్లు: ఆగస్టు, 21 (తెలుగు న్యూస్ పవర్. కామ్) నియోజకవర్గంలో ఉన్న ఏకైక మున్సిపాలిటీ పాలకొల్లు. ఈ మున్సిపాలిటీ అయిన పెంచడం కోసం, పరిసర గ్రామాల విలీనం కోసం ప్రతిపాదనలు ప్రభుత్వానికి వెళ్లాయి. నాటి మున్సిపల్ చైర్మన్ వలపు నారాయణమూర్తి ఇందుకోసం కృషి చేశారు. మున్సిపాలిటీలో విలీనం చేయడానికి 7 గ్రామాలకు పరిధి విస్తరించారు. అయితే, మున్సిపాలిటీలో చేర్చడం వల్ల వసతులు పెరుగుతాయని, భూముల ధరలు పెరుగుతాయని కొందరు విలీనానికి సుముఖత వ్యక్తం చేశారు. అయితే, ముఖ్యంగా అడవిపాలెం, గుంటూరు గ్రామాలకు సంబంధించి విలియడానికి వ్యతిరేకంగా కోర్టులో కేసులు వేశారు. ఈ కేసులు వేయడం వెనక కొందరు బడా వ్యాపారులు, పరిశ్రమల వారి హస్తము ఉన్నట్టు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు, డబ్బు తీసుకొని ఈ కేసులు వేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఏడు విలీన గ్రామాలకు పాలకొల్లు మున్సిపాలిటీ తో పాటు ఎన్నికలు జరగవలసి ఉండగా, కేసుల వల్ల సాధ్యం కాలేదు. ఈ సమస్య వల్ల వివిధ మార్గాల ద్వారా వచ్చే నిధులకు దారులు మూసుకుపోయాయి. డ్వాక్రా దగ్గర నుంచి వివిధ ప్రభుత్వ పధకాలు ద్వారా లబ్ధిదారులకు అందవలసిన ప్రయోజనాలు ఆగిపోయాయి. అయితే మంత్రి నిమ్మల రామానాయుడు చొరవతో కొన్ని సమస్యలకు పరిష్కారం దొరికింది. అడవిపాలెం మహిళలకు మంత్రి ఆదేశాలతో ఐదేళ్ల తర్వాత రుణాలు మంజూరు అయ్యాయి. మున్సిపల్ శాఖ మాత్యులు పెట్టి నారాయణ మున్సిపాలిటీని సందర్శించిన సందర్భంగా, ఈ సమస్యకు పరిష్కారం వెతకాలని కోరారు. మంత్రి నిమ్మల అవసరమైతే ఏడు విలేని గ్రామాలు తప్పించి ఎన్నికలకు వెళ్ళటానికి ప్రయత్నం చేస్తామన్నారు. ప్రస్తుతం అధిక సంస్థల ఎన్నికలు ప్రక్రియ వచ్చేనెల 7 నుంచి ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా, శుక్రవారం రాత్రి జరిగిన పత్రికా సమావేశంలో స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జల వనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ, ఎన్నికలు మెరిసిపోవటం వల్ల గత ఏడేళ్లుగా స్థానిక సంస్థలకు వలసిన కోట్ల నిధులు నిలిచిపోయాయని, అభివృద్ధి పనులు ఆ గిపోవాలను వ్యక్తం చేశారు. ప్రతిపాదిత విలీన 7 గ్రామాల కక్షిదారులు కేసులు వెంటనే ఉపసంహరించి చేశారు. ఇందుకోసం సంప్రదింపులు జరుపుతున్నట్టు వెల్లడించారు. స్థానిక నాయకత్వం నాయకత్వం అండతో మరింత వేగంగా అభివృద్ధి పనులు చేయటానికి వీలవుతుందని మంత్రి తెలిపారు. ఎన్నికల గడుగు నాటికి కేసుల ఉపసంహరణ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. కాని పక్షంలో, ఇప్పటికే ఎంతో పడిపోయిన అభివృద్ధి, మరింత చిక్కుల్లో పడుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక సంస్థ లు పదవులు అనుభవించాలి విహరించిన ఇప్పటికే ఐదేళ్లుగా అవకాశాన్ని కోల్పోయారు. ఈ సమస్య ఆశావహుల అవకాశాలపై నీళ్లు చల్లుతుంది. న్యాయ పరమైన చిక్కుల్లోంచి తప్పించుకుని ఎన్నికలు జరగాలని, అభివృద్ధి కాముకులు ఆకాంక్షి స్తున్నారు.