పాలకొల్లు, నవంబర్ 14 ( తెలుగు న్యూస్ పవర్) పాలకొల్లు తెలుగుదేశం నూతనకమిటీల ఆవిర్భావ సభకు స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర జల వనరుల శాఖ మాత్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా పాలకొల్లు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి మోటార్ సైకిల్ ర్యాలీ తో లంకలకోడేరు తరలి వెళ్లారు. పాముల రజిని కుమార్ మండల తెలుగుదేశం అధ్యక్షులుగా, ఇతర అనుబంధ విభాగాల సభ్యులు పదవీప్రమాణస్వీకారం చేశారు. ఈ సభలో తూర్పుగోదావరి జిల్లా డీసీఎంఎస్ అధ్యక్షులు పెచ్చెట్టి చంద్రమౌళి, ఏఎంసి చైర్మన్ కోడి విజయభాస్కర్, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్రావు, రాష్ట్ర కార్యదర్శి పెశేట్టి బాబు, గండేటి వెంకటేశ్వర రావు, గొట్టుముక్క సూర్యనారాయణ రాజు, పలువురు పార్టీనాయకులు కార్యకర్తలు ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు.