Skip to main content

Telugu News Power

నియోజకవర్గం అభివృద్ధికి రూ.1040 కోట్ల నిధులు తెచ్చాను. -మంత్రి నిమ్మల. మోటార్ సైకిల్ పై మంత్రి మరథాన్.

మున్సిపల్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్న మంత్రి నిమ్మల
మోటార్ సైకిల్ పై అభివృద్ధి పనుల పరిశీలన పర్యటన

పాలకొల్లు: ఆగస్టు,4( తెలుగు న్యూస్ పవర్.కామ్) కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో నియోజకవర్గ అభివృద్ధి కోసం రూ.1040 కోట్ల రూపాయల నిధులు తెచ్చినట్టు, స్థానిక శాసనసభ్యులు, మంత్రి నిమ్మల రామానాయుడు మంగళవారం నిర్వహించిన పత్రిక సమావేశంలో వెల్లడించారు. పట్టణంలో జరుగుతున్న కోట్లాది రూపాయల అభివృద్ధి పను లు మంత్రి సుమారు ఐదు గంటల పాటు మోటార్ సైకిల్ పై పర్యటించి సమగ్రంగా పరిశీలించారు. నరసాపురం ఆర్డీవో దాసిరాజు ఆయన వెంట పెట్టుకుని ఈ పర్యటన చేశారు. పాలకొల్లు చుట్టేసి అభివృద్ధి పనులను పరిశీలించిన అనంతరం స్థానిక మున్సిపల్ కార్ యాలయం ఇది శాఖల అధికారులతో సమగ్ర సమీక్ష నిర్వహించారు. అభివృద్ధి పనులు సరవేగంతో పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. అభివృద్ధి పనుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదన్నారు. పాలకొల్లు ఆసుపత్రి ఆ వరణ పై మంత్రిస్తాయి వరకు ఫిర్యాదు చేసినట్టు పేర్కొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రూ. 12.60 కోట్లతో ప్రభుత్వ ఆసుపత్రికి నిధులు మంజూరు చేయించినట్లు వెల్లడించారు. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రిని నిర్లక్ష్యం చేసింది అని ఆరోపించారు. ఆస్పత్రిలో నీరు నిలిచిపోయే పరిస్థితి, బీటలు వారిన పరిస్థితి ప్రారంభం కాకుండానే దాపురించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. తాము చేస్తున్న అభివృద్ధిని ప్రజలు గమనిస్తున్నారని, వైసిపి నాయకులు చేస్తున్న ఆరోపణలు నమ్మే పరిస్థితి లేదన్నారు. ఎక్కడైనా పొరపాట్లు జరిగితే వాటిని సరిదిద్దీపన పరిస్థితి, ందుకు కట్టిన మైన చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. అహర్నిశలు నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడుతున్న తమను విమర్శించటం తగదన్నారు. ఈ కార్యక్రమంలో, కమిషనర్ డి కిరణ్ కుమార్, డి ఈ విజయ్, టి పి ఓ కే వీరభద్రం, ప్రభుత్వ ఆసుపత్రి పర్యవేక్షకులు డాక్టర్ ఎర్ర మాధురి, కూటమి నాయకులు పెచ్చెట్టి బాబు, గండేటి వెంకటేశ్వరరావు, జక్కంపూడి కుమార్, కోలాటి పెద్దిరాజు, పసుపులేటి రాజేష్ ఖన్నా, పొట్నూరు శ్రీనివాస్, మల్లంపల్లి ఫకీర్, చిన్నమిల్లి గణపతి రావు, బిట్టా లక్ష్మీనారాయణ, విన్నకోట గోపి, ధనాని సూర్య ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.