Skip to main content

Telugu News Power

కొత్త ఓటర్ల నమోదుకు వచ్చే నెల వరకు గడువు.

అఖిలపక్ష నాయకులతో మాట్లాడుతున్న తాశీల్దార్ కిషోర్

పాలకొల్లు:ఆగష్టు, 4(తెలుగు న్యూస్ పవర్. కామ్) ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ ఐ ఆర్ ) కార్యక్రమం పూర్తయిన సందర్భంగా, తహశీల్దార్, యడ్ల దుర్గా కిషోర్, స్థానిక కార్యాలయంలో అఖిలపక్ష సమావేశం మంగళవారం నిర్వహించారు. తదుపరి కార్యాచరణ నాయకులకు వివరించారు. మ్యాపింగ్ జరగనివి, ఎన్యూమరేషన్ ఫార్మ్ లో తప్పులుగా ఉన్నవాటికి ఈనెల 30 వరకు నోటీసులు ఇస్తారు. వాటికి సరైన పత్రాలు సమర్పించి సరిచేసుకోలని కోరారు. కొత్తగా ఓటరుగా నమోదు చేసుకోడానికి ఫార్మ్-6 సమర్పించాలని సూచించారు. ఓటు తొలగింపుకు
ఫార్మ్-7, ఓటు వేరే చోటికి బదిలీ చేసుకోడానికి ఫార్మ్-8 సమగ్రంగా పూరించి అధికారులకు అందజేయాలని కోరారు. ఇందుకు వచ్చే నెల వరకు గడువు ఉందని వెల్లడించారు. కొత్త ఓటర్ల జాబితా అక్టోబర్,3 నాటికి విడుదల అవుతుందన్నారు. ఈ సమావేశంలో,తెలుగు దేశం పట్టణ అధ్యక్షులు, గండేటి వెంకటేశ్వర రావు, వైసిపి మండల నాయుకులు ఉచ్చుల స్థాలిన్ బాబు, జనసేన, జిల్లా నాయకులు తులా రామలింగేశ్వర రావు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.