పాలకొల్లు: నవంబర్,16( తెలుగు న్యూస్ పవర్) చూసి తెలుసుకున్న దాని కంటే, చేసి నేర్చుకున్నది చిరకాలం గుర్తుండి పోతుందని ప్రముఖ వైద్యులు, పాలకొల్లు మాజీ ఎమ్మెల్యే త్సవటపల్లి సత్యనారాయణ మూర్తి పేర్కొన్నారు. పాలకొల్లు హౌసింగ్ బోర్డ్ కాలనీలో గల సుభాష్ చంద్రబోస్ హై స్కూల్ వెనుక ఉన్న అద్దె భవనంలో సైన్స్ సెంటర్ ఆదివారం ప్రారంభించిన సందర్భంగా డాక్టర్ బాబ్జి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రస్తుత సమాజానికి సైన్స్ అవసరం ఎంతో ఉందన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులకు ముందుగా ఈ సైన్ సెంటర్ పట్ల అవగాహన కల్పించాలన్నారు. తద్వారా విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో ఈ సైన్ సెంటర్ ను వినియోగించుకోగలరన్నారు. ఇంత భారీ వ్యయ ప్రయాసలు భరించి సైన్ సెంటర్ ను ఏర్పాటు చేసిన, నిర్వాహకుల సాహసోపేత నిర్ణయాన్ని డాక్టర్ బాబ్జి అభినందించారు. ట్రస్ట్ అధినేత అల్లం రాజు రామశాస్త్రి మాట్లాడుతూ పాఠశాలలో కంటే ఈ సైన్స్ సెంటర్లో సైన్స్ విషయాలు ఎక్కువ నేర్చుకునే వీలుంటుందఅన్నారు. త్వరలోనే
మ్యాథ్స్ ల్యాబ్ కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ట్రస్ట్ కార్యదర్శి జగన్నాధ రావు మాట్లాడుతూ ఈ సైన్ సెంటర్ వల్ల విద్యార్థుల్లో తార్కిక ఆలోచన విధానం మెరుగు అవుతుందన్నారు.
ఈ సైన్స్ సెంటర్ ను ప్రైవేట్ స్కూల్స్ సహితం, వారి విద్యార్థులను పంపి, సైన్స్ పట్ల వారికి అభిరుచిని పెంపొందింపజేస్తున్నాయన్నారు. అవసరాన్ని బట్టి సైన్స్ పరికరాలు భవిష్యత్తులో సైన్స్ పరికరాలు ఇంకా పెంచుతామన్నారు. విద్యా చైతన్య సమాఖ్య అధ్యక్షులుసైన్స్ సెంటర్ నిర్వాహకులు పోలిశెట్టి శ్రీశ్రీ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులు ఈ సైన్ సెంటర్ ను సందర్శించడానికి, తద్వారా అనుభవపూర్వకమైన సైన్స్ సంగతులు నేర్చుకోవడానికి ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు అనుమతి ఇప్పించవలసిందిగా కోరారు.ఈ సభలో ఎంఈఓ గుమ్మల్ల వీరాస్వామి మాట్లాడుతూ అధికారులకు ఈ విషయమై విన్నవించానన్నారు. కాకినాడ అల్లం రాజు చారిటబుల్ ట్రస్ట్ మరియు క్రియ సొసైటీ కాకినాడ, విద్య చైతన్య సమాఖ్య పాలకొల్లు వారి సంయుక్త ఆధ్వర్యంలో ఈ సైన్స్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఇప్పటికే సైన్సు కు సంబంధించిన వివిధ విభాగాల పరికరాలు టెలిస్కోప్ తో సహా సిద్ధం చేశారు. విద్యార్థులకు ఇక్కడ పూర్తి ఉచితంగా సైన్స్ సంగతులు అనుభవ పూర్వకంగా నేర్పిస్తారు. ఈ సైన్స్ సెంటర్ సమన్వయ కర్తలు యర్ర అజయ్ కుమార్, కెవి రాయప రాజు వెంకట్రావు, పూలఖండం శ్రీనివాస్ మాట్లాడారు. సమాఖ్య సభ్యులు తోలేటి గాంధీ, జవాది నాగేశ్వరరావు మంచెం ఉమామహేశ్వరరావు, మంచం కనకరాజు, వంగా అరుణ్ కుమార్, చేగొండి కరుణ, డివి ప్రసాద్ తదితర సభ్యులు కార్యక్రమం పర్యవేక్షించారు. మాడభూషి కృష్ణప్రసాద్, ఎం ఉదయ్ కుమార్, పలువురు ఉపాధ్యాయుని,ఉపాధ్యాయులు ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.
విద్యార్థులకు వరం పాలకొల్లు సైన్స్ సెంటర్