Skip to main content

Telugu News Power

ధర్మారావు ఫౌండేషన్ వెలుగులు

పాలకొల్లు:నవంబర్,24 (తెలుగు న్యూస్ పవర్) పాలకొల్లు ఎమ్మెల్యే, రాష్ట్ర జలవనుల శాఖామాత్యులు వారి తండ్రి నిమ్మల ధర్మారావు పేరుతో నిర్వహిస్తున్న స్వచ్ఛంద సేవా సంస్థ ధర్మారావు ఫౌండేషన్ ద్వారా ఒక చిరు వ్యాపారి జీవితంలో వెలుగులు నింపింది. పూలపల్లి రంగరాజు రైస్ మిల్ ఎదురుగా ఉన్న కూల్ డ్రింక్ షాప్ లో ఈ వెలుగులు ప్రసరించాయి. కుక్కల సత్యనారాయణమ్మ ఈ షాపు నిర్వహించుకుంటున్నారు. రాత్రిపూట కూడా వ్యాపారం నిర్వహించుకోవడానికి అనువుగా తనకు ఒక ఛార్జింగ్ లైట్ ఇప్పించవలసిందిగా మంత్రివర్యులను ఆమె గతంలో కోరి ఉన్నారు. ఆ మేరకు మంత్రి సూచనతో సభ్యులు చార్జింగ్ లైట్ షాపు దగ్గర అందజేశారు. ఫౌండేషన్ సభ్యులు, స్థానిక నాయకులు వేగేశ్న శ్రీ హరి రాజు, గండేటి వెంకటేశ్వరరావు, పీతల శ్రీనివాస్ ,గుబ్బల హరిప్రసాద్, రావూరి వెంకట అప్పారావు, మామిడి శెట్టి కేశవరావు పాలపర్తి చంద్రజి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.