పాలకొల్లు:డిసెంబర్,9(తెలుగు న్యూస్ పవర్) స్థానిక వాకర్స్ క్లబ్ తరపున మూడేళ్ల బాలునికి వైద్య సహాయం నిమిత్తం 20వేల రూపాయలు బాధిత కుటుంబానికి అందజేశారు. పాలకొల్లు రూరల్ పంచాయతీ పరిధిలోగల యళ్ళవాని గరువుకు చెందిన మూడేళ్ల బాలుడు,గోగనమండ జడన్ పాల్ కు కాంక్లియర్ ఇంప్లాంట్స్ చేయవలసి ఉంది. వీరితో పాటు పాలకొల్లు,పెదపేటకు చెందిన నేతల ఎస్తేరు రాణి కీళ్లవ్యాధి నివారణ కోసం ఏడు వేల రూపాయల ఖర్చుతో మందులు కొనిచ్చారు. ఈ విధంగా సాయం చేయడం లో ఉన్న ఆనందం, సంతృప్తి ఎంతో గొప్పదని అధ్యక్షులు తటవర్తి సుధాకర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి షేక్ పీర్ సాహెబ్, ఉపాధ్యక్షుడు మానం బసవరాజు, కోశాధికారి పోతుల ఉమా శంకర్ రావు, జవ్వాజి కళ్యాణ్, గుడాల హరిబాబు పాల్గొన్నారు.