Telugu News Power

అద్భుత జ్ఞాపకం, ఏ ఎస్ ఎన్ ఎం అమేజింగ్ రీయూనియన్

 రియూనియన్ ఓ జ్ఞాపక చిత్రం

 

భీమవరం:డిసెంబర్,13 (తెలుగు న్యూస్ పవర్) పలకరింపులు, కౌగిలింతలు, నవ్వులు, కేరింతలు, తుళ్ళింతలతో ఉప్పొంగిన ఆత్మీయ హృదయ సమ్మేళన అపురూప దృశ్యం ఆవిష్కృతం అయ్యింది. అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ కళాశాల పూర్వ విద్యార్థుల కలయిక.భీమవరం(జక్కరం)లోని ఓ ఫామ్ హౌస్ లో శనివారం జరిగిన సందర్భంగా ఈ అద్భుత ఘట్టం చోటు చేసుకుంది. ఈ కాలేజీలో 1979 నుంచి 1982 వరకు చదువుకున్న పూర్వ విద్యార్థులు తమ జ్ఞాపకాలు ఇక్కడ పంచుకున్నారు. బిజీ లైఫ్ నుంచి బ్రేక్ ఇచ్చి, టైం మిషన్ లో దాదాపు 45 ఏళ్లు వెనక్కు వెళ్లిపోయి ఆ రోజులు మళ్లీ ఎంజాయ్ చేశారు. ఎవరు ఏ స్థానంలో ఉన్న, గమ్యం తెలియని ఆనాటి విద్యార్థి దశలోకి పరకాయ ప్రవేశం చేశారు. ఆటపాటలలో ఉత్సాహంగా పాల్గొని, అందరినీ ఉల్లాస వాతావరణం లోకి తీసుకువెళ్లారు. మనిషి అన్నాక, కాస్త కళాపోషణ ఉండాలని,ఆఫ్ఘనిస్తాన్ రాజు, కెమెరామెన్ కృష్ణ హీరో డ్రస్సుల్లో డాన్సర్లతో స్టెప్పులు వేసి మిత్రులను అలరించారు. మేమేం తక్కువ తినలేదు అన్నట్టు పద్మ వారి బృందం డాన్స్ లు ఇరగదీసారు. కొన్ని జంటలు కూడా స్టెప్పులు వేశారు.చింతపర్రు రాజు అని ముద్దుగా పిలుచుకొనే,సాగిరాజు రామకృష్ణంరాజు 500 నోట్లు సర్ప్రైజ్ గిఫ్ట్ గా ఇస్తూ ఫన్ క్రియేట్ చేసారు. లక్కీ డిప్ బహుమతులు పంచారు. హౌసీ ఆటలో ప్రైస్ లు ఇచ్చారు. మ్యూజికల్ చైర్స్ ఆటలు ఆడారు. పసందైన విందు భోజనం, స్నాక్స్ రుచులూరించాయి. కిరణ్ ఫ్యాక్టరీలో తయారైన సంచి పై ఫెస్ట్ లోగో, సంచి లోపల సరుకులు వారు ఎంత మనసు పెట్టి పనిచేశారనే దానికి అందులో అందులో ఉన్న సరుకులుఅద్ధం పట్టాయి. ఈ సందర్భంగా కోల్పోయిన మిత్రులకు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కలయిక కు “అమేజింగ్ రీయూనియన్” గా ఏఎస్ ఎన్ ఎం ఏజిల్స్ నామకరణం చేసి జ్ఞాపకాలపుటల్లో పదిలం చేశారు. ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా జ్ఞాపకాల్లో నిలిచిపోవడానికి కొన్ని నెలల పాటు శ్రమించారు. రవి, కిరణ్, బాలాజీ మిత్రులందరినీ ప్రోత్సహించి వేదిక కు తీసుకురావదానికి చేసిన కృషి మరువలేనిది. అన్నం వెంకటేశ్వరరావు ఈ కార్యక్రమం నిర్వహణలో పాలుపంచుకున్నారు. ఇజ్జడ రాంప్రసాద్ భద్రాచల రాముని ప్రసాదం తీసుకువచ్చారు.

                  స్నేహిచిత్రం

ఈ కార్యక్రమంలో అద్దేపల్లి మోహన్, తలుపుల శ్రీను, తమ్మినీడి నరసింహారావు, నెక్కంటి ఉదయ భాస్కర్, అద్దేపల్లి మోహన్, గమ్మిడి వెంకటేశ్వర రావు, వివిధ ప్రాంతాల నుంచి సుమారు 80 మంది వరకు ఈ కార్యక్రమానికి తరలి వచ్చారు. ఆదివారం రెండవ రోజు కూడా ఈ వేడుక జరగనుంది.

గర్ల్స్ స్టూడెంట్స్ డాన్స్ పెర్ఫార్మెన్స్

                                                              మిత్రులు మాటామంతి

చింతపర్రు రాజు డాన్స్

రేపాక కిరణ్ తో డాన్సర్లు ముచ్చట్లు

 

రామరాజు,కృష్ణ ,ఎన్టీఆర్,కృష్ణ లు