పాలకొల్లు: డిసెంబర్,22(తెలుగు న్యూస్ పవర్) విద్యార్థులు పైకి రావడానికి గణితం ఎంతో అవసరమని ప్రిన్సిపల్ టి రాజరాజేశ్వరి పేర్కొన్నారు. స్థానిక అద్దేపల్లి అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ కళాశాలలో సోమవారం ప్రపంచ గణితమేధావుల్లో ఒకరైన శ్రీనివాస రామానుజన్ జయంతి ఉత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ రాజరాజేశ్వరి మాట్లాడుతూ, శ్రీనివాస రామానుజన్ జీవిత చరిత్రను, గణిత పరిశోధనలు విద్యార్థులకు వివరించారు. పోటీ పరీక్షల్లో నెగ్గుకు రావాలంటే గణితలో ప్రతిభ తప్పనిసరి అన్నారు. ఈ సందర్భంగా పోస్టర్ మేకింగ్ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. వైస్ ప్రిన్సిపాల్ టి కృష్ణ, అధ్యాపకులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.