Telugu News Power

డిగ్రీ విద్యార్థుల పారిశ్రామిక యాత్ర

ఎక్స్పో నిర్వాహకులతో విద్యార్థులు
లేస్ పార్క్ వద్ద విద్యార్థులు

పాలకొల్లు: డిసెంబర్,23(తెలుగు న్యూస్ పవర్) స్థానిక ఛాంబర్స్ కళాశాల విద్యార్థులు మంగళవారం పారిశ్రామిక యాత్ర చేశారు. ఈ సందర్భంగా వారు నర్సాపురం లో ఉన్న అంతర్జాతీయ లేస్ ట్రేడ్ సెంటర్ సందర్శించారు. ఇక్కడ జరుగుతున్న హస్తకళల ఎక్స్పోకు సంబంధించి, తమ పర్యటన ద్వారా పరిశీలించి, పలు విషయాలు ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. ఈ యాత్రలో సుమారు 150 మంది విద్యార్థులు పాల్గొన్నారు. లేస్ పార్క్ మేనేజింగ్ డైరెక్టర్ కలవకొలను తులసి రావు ఈ లేస్ పార్క్ అంతర్జాతీయ ఖ్యాతి లభించిందన్నారు.ఇక్కడ ఉత్పత్తి అవుతున్న వివిధ రకాల వస్తువుల తయారీ, మార్కెటింగ్ స్టాల్స్ గురించి వివరించారు. ఇక్కడ ఉన్న ఉపాధి అవకాశాల గురించి తెలియజేశారు. ఈ సందర్శనం ద్వారా విద్యార్థులు వ్యాపార నైపుణ్యాలు నేర్చుకోవడానికి, వ్యవస్థాపకులుగా ఎదగడానికి తోడ్పడుతుందన్నారు. విద్యార్థులు ఇక్కడ స్టాల్స్ లో లభించే హస్తకళల వస్తువులను కొనుగోలు చేసి, సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యక్షులు కారుమూరీ నరసింహారావు, కోశాధికారి ప్రవీణ్ భాను, ప్రిన్సిపల్ డాక్టర్ వెంకటేశ్వరరావు, రాధా మాధవి, రాంబాబు, శిరీష విద్యార్థులు పాల్గొన్నారు.

స్టాల్స్ లో వస్తువులు కొనుగోలు చేస్తున్న విద్యార్థులు