Telugu News Power

పశ్చిమగోదావరి జిల్లాలో జాతీయస్థాయి నైపుణ్య శిక్షణ కేంద్రం.

ఒప్పంద పత్రాలు మార్చుకుంటున్న చిత్రం
సభలో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్

నర్సాపురం:డిసెంబర్,28(తెలుగు న్యూస్ పవర్) పశ్చిమగోదావరి జిల్లా పెదమైనవానిలంక గ్రామంలో సైయంట్, కృత్రిమ మేధా(ఏ ఐ) ఫ్యూచర్ స్కిల్స్ హబ్, స్థానిక డిజిటల్ భవన్ లో ఆదివారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ మేరకు రెండు అవగాహన ఒప్పందాలపై కేంద్ర మంత్రి నిర్మల సీతారామ సమక్షంలో సంతకాలు జరిగాయి. తొలి అవగాహన ఒప్పందం స్థానిక జిల్లా పరిపాలన యంత్రాంగం, ఇండియా ఎగ్జిమ్ బ్యాంక్ మధ్య కుదిరింది. వీరు నైపుణ్య అభివృద్ధి, క్లస్టర్ అభివృద్ధి, ఎగుమతి సంసిద్ధతపై అంతర్జాతీయ స్థాయి శిక్షణ అందిస్తారు. మహిళలకు డిజిటల్ ఎగుమతి నైపుణ్యాలు నేర్పిస్తారు.
రెండో అవగాహన ఒప్పందం స్థానిక జిల్లా పరిపాలన యంత్రాంగం, గ్లోబల్ అలయన్స్ ఫర్ మాస్ ఎంటర్ప్రైన్యూర్షిప్,(గేమ్) మధ్య జూనియర్ అచీవ్మెంట్ ఇండియా సర్వీసెస్ ద్వారా ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం ద్వారా జిల్లా స్థాయిలో వ్యాపార వాతావరణ పరిస్థితులు బలోపేతం చేస్తారు. ఇప్పటికే ఉన్న వ్యాపారాలు విస్తృతం చేయడాని సహకరిస్తారు. గ్రామీణ ప్రాంత,మహిళలు యువతకు స్థిరమైన ఉపాధి అవకాశాలు కల్పిస్తారు.

వచ్చే ఐదేళ్లలో లక్ష్యాలు.
రాబోయే ఐదేళ్లలో ఐదు వేల స్థానిక సంస్థలకు మద్దతుగా నిలుస్తారు.25 వేల జీవనోపాధి అవకాశాలు సృష్టిస్తారు. దీనివల్ల జిల్లా ఆర్థిక వ్యవస్థ మరింతగా బలపడటం, వైవిధ్యంగా అభివృద్ధి చెందడం జరగనుంది. మారుమూల గ్రామానికి ఈ మహర్దశ పట్టనుంది.

ప్రధానమంత్రి మన్ కీ బాత్ వింటున్న కేంద్రమంత్రి నిర్మల సీతారామన్