ఆంధ్రప్రదేశ్ లో జిల్లాలు, మండలాల మార్పులు
నరసాపురానికి మొండిచేయి
అమరావతి: డిసెంబర్,29(తెలుగు న్యూస్ పవర్) విభజిత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం 13 జిల్లాలతో ఏర్పాటు అయింది. వీటిని పరిపాలన సౌలభ్యం కొరకు వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం, 26 జిల్లాలకు పెంచింది. అయితే జిల్లా పరిషత్ పరిపాలన ఉమ్మడి జిల్లా కేంద్రంగానే నడుస్తుంది. కూటమి ప్రభుత్వం 26 జిల్లాలుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జిల్లాల ముఖచిత్రాన్ని మార్చనుంది. గతంలో ఉన్న 9 జిల్లాల్లో ఏ విధమైన మార్పు లేదు. మిగిలిన 17 జిల్లాల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం గత నెల 27న పునర్వ్యవస్థీకరణ కు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈనెల 27 వరకు అభ్యంతరాలకు గడువు ఇచ్చింది. నూతన ప్రతిపాదనల మేరకు 24 మార్పులు చోటుచేసుకోన్నాయి. ఈనెల చివరకు తుది నోటిఫికేషన్ విడుదల చేస్తారు.
జిల్లాల వారీగా మార్పులు
శ్రీకాకుళం జిల్లా
నందిగాం మండలాన్ని, టెక్కలి డివిజన్లో కలపాలని ప్రతిపాదన.
అనకాపల్లి జిల్లా
అడ్డరోడ్డు జంక్షన్ ఇక కొత్త రెవిన్యూ డివిజన్.
అల్లూరి సీతారామరాజు జిల్లా
నుంచి కొత్తగా పోలవరం జిల్లాను ఏర్పాటు చేస్తారు.
కాకినాడ జిల్లా
సామర్లకోటను, పెద్దాపురం డివిజన్ కు కలుపుతారు.
బాపట్ల /ప్రకాశం జిల్లాలు
అద్దంకి రెవెన్యూ డివిజన్, 5మండలాలను కలిపి కొత్తగా ఏర్పాటు చేస్తారు.
కొత్త జిల్లాలు
పోలవరం జిల్లా
మార్కాపురం జిల్లా
కొత్త రెవెన్యూ డివిజన్లు
అడ్డరోడ్ జంక్షన్
మడకశిర
కొత్త మండలాలు
ఆదోని 1
ఆదోని 2
జిల్లా కేంద్రం మార్పు
రాయచోటి నుంచి
మదనపల్లి
పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ ఇకనుంచి
వాసవి పెనుగొండ గా నామాంతరం చెందుతుంది. ఇంతకుమించి ఈ జిల్లాలో ఏ విధమైన మార్పు లేదు. నరసాపురం జిల్లా కేంద్రంగా చేయాలని ఉద్యమం నడిచింది. బ్రిటిష్ కాలం నాటి నుంచి సర్వహంగులతో నరసాపురం రెవెన్యూ డివిజన్ గా కొనసాగుతుంది. జిల్లా కేంద్రం ఏర్పాటుకు అవసరమైన భవనాలు కూడా అర్ధ రూపాయి అద్దె చెల్లించ కుండా, కట్టని కోటలా సిద్ధంగా ఉంటాయి. జగనన్న ప్రభుత్వంలో యుద్ధం ప్రకటించి, కూటమి ప్రభుత్వం వచ్చాక, కిమ్ అనకుండా, మిన్నకుండి పోవడం ప్రజలకు ఆశ్చర్యం కలిగిస్తుంది. స్థానిక ఎమ్మెల్యే జనసేన పార్టీ, ప్రభుత్వ విప్ కూడా కావడంతో ఆశలు చిగురించినా, నిరాశే ఎదురయింది. ప్రతిపాదనలు ప్రభుత్వం ఆమోదించడం లాంచనప్రాయమే.