
భీమవరం: డిసెంబర్,3(తెలుగు న్యూస్ పవర్) భారతదేశ మొట్టమొదటి, మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాలు ఆయా పాఠశాలలో ఘనంగా జరిగాయి. జిల్లాలో దాదాపు 17 మండలాల్లో శనివారం కార్యక్రమం జరిగిందని జిల్లా యుటిఎఫ్ కార్యదర్శి పోలిశెట్టి క్రాంతి కుమార్ తెలిపారు. ఆదివారం మండల స్థాయిలో ఈ కార్యక్రమం జరపనున్నట్టు వెల్లడించారు. ఎలమంచిలి మండలంలో అన్ని పాఠశాలలో జయంతి ఉత్సవాలు జరిగాయి. ఆయన పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. పలువురు మహిళా ఉపాధ్యాయులను ఈ సందర్భంగా సత్కరించారు. గత రెండు సంవత్సరాలుగా సెలవు పెట్టని ఉపాధ్యాయుని సత్తి నాగపరమేశ్వరిని, విశ్రాంత ఉపాధ్యాయురాలు ఉష కమల్ సత్కరించారు.
