Skip to main content

Telugu News Power

నేడే ఛాంబర్స్ కాలేజీలు పండుగ సంబరాలు

ముగ్గుల పోటీల్లో పాల్గొన్న విద్యార్థినులు

పాలకొల్లు: డిసెంబర్, 8(తెలుగు న్యూస్ పవర్) స్థానిక ఛాంబర్స్ కళాశాలలో శుక్రవారం ఉదయం నుంచి సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నారు. పండుగ సంప్రదాయం ప్రకారం భోగి మంటలు, గంగిరెద్దుల వారి ఆట,కోలాటం భజన,గరగ నృత్యాలు, హరిదాసు కీర్తనలు, పిండి వంటలు తయారీ, విద్యార్థులచే విద్యార్థులచే నృత్య ప్రదర్శన వంటి వివిధ సాంస్కృతి కార్యక్రమాలతో ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, పట్టణ ప్రముఖులు,వ్యాపార సంఘాల వారు, పుర ప్రజలు విచ్చేసి, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా,సంక్రాంతి సంబరాలకు కాలేజీ కమిటీ వారు ఆహ్వానించారు.