Telugu News Power

వాలీబాల్ పోటీలు ప్రారంభం

వాలీబాల్ లాంచన ప్రారంభం

యలమంచిలి: జనవరి,9(తెలుగు న్యూస్ పవర్) స్థానిక మూలస్థానేశ్వరి అమ్మవారి సంక్రాంతి సంబరాల్లో భాగంగా, శుక్రవారం, రాత్రి వాలీబాల్ పోటీలు, నరసాపురం ఆర్టీవో దాసిరాజు, స్థానిక తహసిల్దార్ గ్రంధి పవన్ కుమార్ తో కలిసి ప్రారంభించారు. యలమంచిలికి చెందిన, చిలుకూరి వెంకటేశ్వరరావు స్మారక వాలీబాల్ పోటీల, విజేతలకు మొదటి బహుమతి 36 వేల రూపాయలు, రెండో బహుమతి 18 వేల రూపాయలు ప్రకటించారు. ఆటలు పోటీలు ప్రారంభించిన సందర్భంగ స్పాన్సర్ చిలుకూరి వెంకటేశ్వర రావు చిత్రపటానికి, ఆర్టీవో దాసిరాజు, తాసిల్దార్ పవన్ కుమార్ పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా క్రీడా జట్లను ఆర్డిఓ పరిచయం చేసుకున్నారు. ఆర్డీవో జట్టు, తహసిల్దార్ జుట్టు గా, దొడ్డిపట్ల ,వీరవాసరం జట్లతో ఆడి, రాజ్యాంగ పోటీలు ప్రారంభించారు. కార్యక్రమంలో తాళ్లూరి శ్రీనివాస్(వైజాగ్ బుజ్జి), బొప్పన రాంబాబు, తాళ్లూరు వెంకటేశ్వరరావు, సిద్ధాని రాము, బొల్లిపల్లి శ్రీనివాస్, చిలుకూరి శ్రీనివాస్, తెలుగుదేశం నాయకులు, పీతల శ్రీనివాస్, చిట్టూరి రామాంజనేయులు, ఆరమిల్లి చిన్ని, మాత రత్నం రాజు, చిలుకూరి బాలాజీ, స్థానిక నాయకులు కాసా సత్య, చివటపు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

చిలుకూరి వెంకటేశ్వరరావు చిత్రపటానికి, ది వాళ్ళ నేర్పిస్తున్న ఆర్డిఓ దాసిరాజు ఎమ్మార్వో పవన్ కుమార్