Skip to main content

Telugu News Power

లిఫ్ట్ బాల్ పోటీలు ప్రారంభం

పోటీలు ప్రారంభిస్తున్న గుడాల గోపి

పాలకొల్లు: జనవరి,10(తెలుగు న్యూస్ పవర్) డీసీఎంఎస్ మాజీ అధ్యక్షులు, వైఎస్ఆర్సిపి నాయకులు, యడ్ల తాతాజీ, ఆధ్వర్యంలో, ఎడ్ల గణేశ్వర రావు సేవా సంస్థ, సంక్రాంతి పండుగ సందర్భంగా లిఫ్ట్ బాల్ పోటీలు శనివారం ప్రారంభించారు. స్థానిక నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఇంచార్జ్ గుడాల హరి గోపాల్ రావు,గోపి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పండుగ వేళ వ్యసనాల వైపు వెళ్లకుండా,సాంప్రదాయ క్రీడల్లో పాల్గొనడం అవసరమన్నారు. ఇందువల్ల ఆరోగ్యం, ఆనందం కలుగుతాయన్నారు. కనకదుర్గ ఫ్రెండ్స్ యూనియన్ కమిటీ ఆర్గనైజింగ్ కార్యదర్శి, మోపిదేవి అప్పారావు, అడపా శ్రీను, అనిశెట్టి సుబ్బరాజు, కే జయ సరిత, కోరాడ శ్రీనివాస్, నిన్ను ఉనికేల శ్రీను, కానూరు శైలు తదితరులు పాల్గొన్నారు.