Telugu News Power

ఎమ్మెల్యే కప్ విజేతలు వీరే

విజేతలకు బహుమతి ప్రధాని చేస్తున్న కూటమి నాయకులు

పాలకొల్లు: జనవరి:14(తెలుగు న్యూస్ పవర్) స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర జలవనరుల, శాఖామాత్యులు, నిమ్మల రామానాయుడు, ధర్మారావు ఫౌండేషన్ ద్వారా స్థానిక బిఆర్ఎంవి హై స్కూల్ ప్రాంగణంలో, ఎమ్మెల్యే కప్, కలిదిండి రామరాజు (ఆడిటర్ రామరాజు) స్మారక కబడ్డీ పోటీలు, బుధవారం రాత్రి ముగిశాయి. హోరా హోరీగా జరిగిన ఈ పోటీల్లో,పురుషుల విభాగంలో ఎస్సీఈసీ రైల్వే జట్టు ఎమ్మెల్యే కప్ చేజిక్కించుకుంది. మహిళల విభాగంలో, ఢిల్లీ సిఆర్పిఎఫ్ జట్టు కప్ దక్కించుకుంది. ఈ ఇరుజట్లకు, చెరో లక్షన్నర రూపాయల నగదు బహుమతి తో పాటు, షీల్డ్ అందించారు. ఢిల్లీ రాజ్ రైఫిల్స్, పురుషుల జట్టు, ద్వితీయ స్థానం నిలిచింది. మహిళల విభాగంలో వేద కుమార్ హర్యానా జుట్టు రెండో స్థానంలో, లక్ష రూపాయలు చొప్పున బహుమతులు అందుకున్నారు. తృతీయ స్థానం, పురుషులు, కలకత్తా పోలీస్ జట్టు, మహిళలు,పానిపట్ రాయల్ స్పోర్ట్స్, వారు 75 వేల రూపాయలు చప్పున ప్రైజ్ మనీ అందింది. నాలుగో స్థానం, పురుషులు, హర్యానా రోహతక్ జట్టు, మహిళలు,కలకత్తా పోలీస్ జట్లు, చెరో50వేల రూపాయలు నగదు బహుమతి అందుకున్నాయి. ఈ సందర్భంగా క్రీడాకారులు, ధర్మారావు ఫౌండేషన్ వారు చేసిన అతిధి మర్యాదల పట్ల, భోజనం ఏర్పాట్లు పట్ల ఎంతగానో సంతోషం వ్యక్తం చేశారు. మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు, క్రీడాకారులను,కేంద్ర మంత్రివర్యులు భూపతి రాజు శ్రీనివాస్ వర్మ క్రీడాకారులను పరిచయం చేసారు. కూటమి నాయకులతో కలిసి క్రీడాకారులకు బహుమతి ప్రధాన ఉత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు, ఉన్నమట్ల కాపర్తి,టిడిపి రాష్ట్ర కార్యదర్శి పెచ్చెట్టి బాబు, పట్టణ అధ్యక్షులు గండేటి వెంకటేశ్వర రావు, కడలి గోపి, ఎంఈఓ గుమ్మళ్ళ వీరస్వామి, బోనం నరసయ్య, కర్నేని రోజారమణి గౌర్నాయుడు దంపతులు, పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు. ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు.

కేంద్ర మంత్రి వర్మకు క్రీడాకారులను పరిచయం చేస్తున్న రాష్ట్ర మంత్రి నిమ్మల