Telugu News Power

యలమంచిలిలో డబుల్ ధమాకా సంక్రాంతి

యలమంచిలి:జనవరి,14(తెలగు న్యూస్ పవర్) సంక్రాంతి సంబరాలకు యలమంచిలి వచ్చే సందర్శకులకు ఈ ఏడాది డబుల్ ధమాకా పండగ ఆతిథ్యం అందుతుంది. స్థానిక దాత, తమ్మినీడి నరసింహారావు, ఎస్టేట్స్ లో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాల చూపరులను ఆకట్టుకుంటున్నాయి. అతి తక్కువ సమయంలో, ఏర్పాట్లు చేయడం వల్ల, ఆ మేరకు సఫలీకృతులయ్యారంటున్నారు. బంధుమిత్రులు, సందర్శకులు ఈ సంక్రాంతి సంబరాల్లో ఆనందాన్ని పంచుకుంటున్నారు. ఇక్కడ 18 రకాల వంటలతో ఉచిత భోజన సౌకర్యం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు బొప్పన హరికిషోర్, చిన్న తెలిపారు. ఇక్కడ ఎద్దులు ఏనుగు బొమ్మలు ఆకట్టుకుంటున్నాయి. సినీ నేపద్య సంగీత నృత్యాలు ఏర్పాటు చేశారు. కోడిపందాలు, గుండాటలు సందర్శకులు ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన ఐ లవ్ ఎలమంచిలి వంటి సెట్టింగులు అందంగా అలంకరించారు. టిడిపి నియోజకవర్గ నాయకులు, ఎలమంచిలి సొసైటీ అధ్యక్షులు, బోప్పన చిన్న ,చిలుకూరి రాఘవేంద్ర కుమార్, శశి, టిడిపి మండల ఉపాధ్యక్షులు తమ్మినీడి శ్రీనివాస్, మాజీ సర్పంచులు, తమ్మిననీడి రామకృష్ణ, వెలిచేటి వర్మ, తదితరులు అతిధులకు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. తొలి ప్రయత్నంలో కొంతవరకు పట్టు సాధించినట్టు తెలియవచ్చింది.

సినీ సంగీత నృత్య విభావరి