భీమవరం: జనవర,16(తెలుగు న్యూస్ పవర్) సంక్రాంతి సందర్భంగా, భీమవరం పరిసర ప్రాంతాల్లో కోట్ల రూపాయల కోడిపందాలు జరుగుతుంటాయి. ఇక్కడ అతిధిమర్యాదలు కూడా ఆస్వాదించి తీరవలసింది. ఎన్నో ప్రత్యేకతలు ఇక్కడ చోటు చేసుకుంటాయి. ఈ ఏడాది, ఓ పందెం పుంజు కోటిన్నర జాక్పాట్ కొట్టి, తన యజమానిని, గంటల్లో కోటీశ్వరుని చేసింది. అలాగే, స్థానిక దుర్గాపురం బరిలోకి బంగారు కోడిపుంజు వచ్చింది. యజమాని 15 కాసుల బంగారు గొలుసు, పులిగోరు వేసి తీసుకురావటం మరో ప్రత్యేకత. కండలు తిరిగిన కోడిపుంజు, మగమహారాజులా ఠవీ, దర్పం వెలగబెట్టి, చూపులను తిప్పనివ్వకుండా, ఆశ్చర్యానికి గురిచేసింది. జీడిపప్పు బాదంపప్పు వంటి ప్రత్యేక ఆహారంతో, తయారైన ఈ కోడిపుంజు బరిలో, కూత వేసి, కయ్యానికి కాలు దువ్వింది. యజమానికి, కాసుల వర్షం కురిపించింది. కోడిపందాల చరిత్ర లో తనకంటూ ఓ పేజీ సృష్టించుకుంది.