
యలమంచిలి: ఫిబ్రవరి, 1(తెలుగు న్యూస్ పవర్) అందరికీ ఆఖరి మజిలీ అయిన స్మశాన స్థలం పవిత్రంగా ఉండాలని స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనర్ల శాఖామాత్యులు రామానాయుడు పేర్కొన్నారు. దొడ్డిపట్ల గ్రామంలో 30 లక్షలతో అభివృద్ధి పరచనున్న స్మశాన వాటిక పనులకు మంత్రి ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో మంత్రి మాట్లాడుతూ, ఏ పని చేపట్టిన పది కాలాలపాటు నిలిచి ఉండేలా తీర్చిదిద్దాలని తన విధానం అన్నారు. పాలకొల్లులో స్మశాన వాటికను, బృందావనంలో తీర్చిదిద్దినట్టు తెలిపారు. మంత్రి ఈ నిధులు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పథకం ద్వారా ఫార్మా కంపెనీ వారి నుంచి 50 లక్షలు సేకరించి దొడ్డిపట్ల 30 లక్షలు, తన సొంత గ్రామానికి 20 లక్షలు కేటాయించి దొడ్డిపట్ల పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నానన్నారు. మంత్రి స్వయంగా స్మశానవాటిక పరిశుభ్రం చేశారు. దొడ్డిపట్ల గ్రామానికి 20 నెలల్లో 27 కోట్ల రూపాయల అభివృద్ధి నిధులు వెచ్చించామని వెల్లడించారు. గుబ్బల తాతయ్య నగర్ రోడ్లు డ్రైనేజీ కోసం 15 లక్షలు, తాడిమిరప కు ఏడు లక్షల, హై స్కూల్ గ్రౌండ్ అభివృద్ధికి ఐదు లక్షలు, కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి 10 లక్షలు కేటాయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు చేగుండి సూరిబాబు, చేగోండి రవిశంకర్, మాజీ జడ్పిటిసి బోనం నాని ప్రసంగించారు. ఎంపీపీ ఇనుకొండ ధనలక్ష్మి, తెలుగుదేశం మండల కమిటీ అధ్యక్షులు మామిడి శెట్టి పెద్దిరాజు, జనసేన మండల అధ్యక్షులు కొడవటి వరబాబు, పాలకొల్లు ఏఎంసి చైర్మన్ కోడి విజయభాస్కర్, సొసైటీ అధ్యక్షులు డేగల సత్తి కొండ, బొప్పన హరి కిషోర్, నీటి సంఘం అధ్యక్షులు ఆరమిల్లి చిన్ని, సర్పంచ్ ల ఛాంబర్ మాజీ అధ్యక్షులు కడలి గోపాలరావు, హై స్కూల్ కమిటీ మాజీ అధ్యక్షులు చేగొండి సీతారామనాయుడు, చిన్ని, ప్రజా ప్రతినిధులు, స్థానికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు