Telugu News Power

ప్రజారోగ్యం పట్ల కూటమి ప్రభుత్వ మానవతా దృక్పదం -మంత్రి నిమ్మల రామానాయుడు.

చిక్కుల పంపిణీ కార్యక్రమంలో మాట్లాడుతున్న మంత్రి నిమ్మల
సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులు

పాలకొల్లు: ఫిబ్రవరి, 2 (తెలుగు న్యూస్ పవర్) ప్రజల ఆరోగ్యం పట్ల తెలుగుదేశం జనసేన బిజెపి తో కూడిన కూటమి ప్రభుత్వం ప్రజారోగ్యం పట్ల మానవత్వంతో వ్యవహరిస్తుందని, స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు,స్పష్టం చేశారు. తన క్యాంపు కార్యాలయం వద్ద ఆదివారం రాత్రి, ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ చేశారు. సీఎంఆర్ఎఫ్ సహాయంకు అర్హులైన 59 మందికి, 24.65 లక్షల రూపాయల చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గత వైసిపి ప్రభుత్వం, సీఎంఆర్ సహాయం కోసం పెట్టుకున్న అర్జీలన్ని చెత్తబుట్ట పాలయ్యాయన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక 20 నెలల్లోనే 10 కోట్ల 68 లక్షల 94 వేల రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి అర్హులకు అందించినట్టు తెలిపారు. దరఖాస్తు అందజేసిన దగ్గర నుంచి సహాయం మంజూరు అయ్యే వరకు అన్ని పనులు తామే చూసుకుంటున్నాను. సెలవు రోజైనా పండగ రోజు అయినా పెళ్లి రోజు అయిన చెక్కుల పంపిణీ చేస్తున్నామన్నారు. పని చేసే ప్రభుత్వానికి ప్రజలు మద్దతు ఇవ్వవలసిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కర్నేని గౌర్నాయుడు, పొట్లూరి శ్రీనివాస్, గండేటి వెంకటేశ్వరరావు, కొట్టం గణేష్, మల్లంపల్లి ఫకీర్ బాబు, కడలిగోపాలరావు, చిన్నమిల్లి గణపతి రావు, చిలుకూరు బాలాజీ, కెమెరా రామారావు తదితర ఫోటో నాయకులు పాల్గొన్నారు.