Skip to main content

Telugu News Power

ప్రపంచ స్థాయి క్రీడాకారులను సృష్టించడమే లక్ష్యం. -ఐటి విద్యాశాఖామాత్యులు లోకేష్.

అమరావతి: ఆగస్టు,5( తెలుగు న్యూస్ పవర్. కామ్) ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రపంచస్థాయి క్రీడా ఛాంపియాలను సృష్టించడమే కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యమని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖామాత్యులు నారా లోకేష్ పేర్కొన్నారు. ఒలంపిక్స్ విజేత, బ్యాడ్మింటన్ అకాడమీ అధినేత పీవీ సింధు మంత్రి లోకేష్ ను బుధవారం కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, దేశ భవిష్యత్తు యువత చేతుల్లో ఉందన్నారు. పీవీ సింధు అకాడమీలో అత్యుత్తమ స్థాయి క్రీడా శిక్షణ లభిస్తుందన్నారు. ఈ శిక్షణ ద్వారా క్రీడాకారులు తమలోని ప్రతిభ మరింత ఇనుమడింప చేసుకోవచ్చని తెలిపారు. అకాడమీలో కేవలం బ్యాడ్మింటనే కాకుండా ఇతర క్రీడల్లో కూడా శిక్షణ ఇచ్చేలా అకాడమీని తీర్చిదిద్దవలసిన అవసరం ఉందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఇందుకోసం ప దగ్గర చేస్తున్నట్టు తెలిపారు. ప్రతి ఛాంపియన్ విజయం వెనక వారి తల్లిదండ్రులు, శిక్షకుల శ్రమదాగి ఉంటుందని వెల్లడించారు. పీవీ సింధు ఈ విధమైన క్రీడా సౌకర్యాలు లేని రోజుల్లో ఒలంపిక్స్ పధకం గెలవటం పట్ల ఆమె కఠోరశ్రమ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఈ భేటి సందర్భంగా, మాజీ విద్యాశాఖ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, రెవెన్యూ శాఖ మాత్యులు ఏ. సత్యప్రసాద్, క్రీడా శాఖ అధికారులు పాల్గొన్నారు