గుంటూరు:ఆగస్టు,5( తెలుగు న్యూస్ పవర్. కామ్) తెలుగు జాతి గర్వించదగిన మహానేత, మహాత్మా గాంధీ ఆశయాలను జీవితాంతం ఆచరించిన గాంధేయవాది, మాజీ పార్లమెంట్ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి దివంగత మండలి వెంకట కృష్ణారావు శతజయంతి సందర్భంగా, ఆయన సేవలను చిరస్మరణీయంగా నిలుపుతూ భారత ప్రభుత్వం ఆయన పేరిట స్మారక తపాలా బిళ్ల విడుదల చేయాలని మాదిగ ఎడ్యుకేషన్ ట్రస్ట్ చైర్మన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిశ్రమల శాఖ మాజీ అదనపు సందాలకులు ఎ.వి. పటేల్ విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో దివిసీమ ఉప్పెన వంటి ప్రకృతి విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ శాఖకు రూ.2,000 కోట్ల ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
దివిసీమ ఉప్పెనలో చరిత్ర సృష్టించిన మహానేత.1977 నవంబరులో సంభవించిన దివిసీమ ఉప్పెన భారతదేశ చరిత్రలో అత్యంత ఘోరమైన ప్రకృతి విపత్తులలో ఒకటి అన్నారు. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారని, వందలాది గ్రామాలు నాశనమయ్యాయి. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారని తెలిపారు. ఆ అత్యంత క్లిష్ట సమయంలో మండలి వెంకట కృష్ణారావు గారు ప్రజల మధ్య ఉండి సహాయక చర్యలను అహర్నిశలు పర్యవేక్షించారన్నారు. బాధితులకు ఆహారం, వైద్యం, ఆశ్రయం, పునరావాసం కల్పించేందుకు నిరంతరం శ్రమించారన్నారు. అంతటి ఖ్యాతి కలిగిన మండలి వెంకట కృష్ణారావు గారి పేరిట స్మారక తపాలా బిళ్ల విడుదల చేయాలని కోరారు.
మండలి వెంకట కృష్ణారావు గారి పేరిట స్మారక తపాలా బిళ్ల విడుదల చేయాలి.