పాలకొల్లు: ఫిబ్రవరి,3(తెలుగు న్యూస్ పవర్) చాంబర్స్ కళాశాల ప్రాంగణ ఎంపికల కార్యక్రమంలో భాగంగా ఈ నెల5న (గురువారం)ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు,కళాశాలలో, ఇంటర్వ్యూలు జరుగుతాయని, ప్రిన్సిపల్ డాక్టర్ డి. వెంకటేశ్వర్రావు వెల్లడించారు. బీఎస్సీ, బీటెక్, ఎమ్మెస్సీ, బిఫార్మసీ, ఎంఫార్మసీ చదివినవారు ఈ ఉద్యోగాలకు అర్హులు. వయస్సు 21-25 ఏళ్ల మధ్య ఉండాలి. కేవలం పురుషు అభ్యర్థులకు మాత్రమే అవకాశం ఇచ్చారు. నెలకు వేతనం 18,000-24000 వేల రూపాయల వరకు ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు, భోజనం, వసతి ఉచితం. వీరికి పిఎఫ్, ఈఎస్ఐ వంటి ప్రభుత్వ సౌకర్యాలు వర్తింప చేస్తారు. ఇతర సౌకర్యాలు కూడా కల్పిస్తారు. హైదరాబాద్, విశాఖపట్నం, కాకినాడ లో పని చేయవలసి ఉంటుంది.అర్హతలు, ఆసక్తి గల అభ్యర్థులు 9912046234,9849712739, ఫోన్ నెంబర్లతో సంప్రదించవలసిందిగా సూచించారు.
దివిస్ కంపెనీలో ఉద్యోగాలు